టికెట్ టూ ఫినాలే లో భాగంగా ఫోకస్ ఛాలెంజ్ అనే టాస్క్ జరుగుతుండగా, కాజల్ ప్రవర్తించిన తీరు హౌజ్‌మేట్స్‌కి చిరాకు తెప్పించింది. వద్దని చెబుతున్నా కూడా ఆన్సర్స్ చెబుతుండడంతో శ్రీరామ్‌కి చిరాకు వచ్చింది. గట్టిగా అరచి బిగ్ బాస్‌కి కంప్లైంట్ ఇచ్చాడు. ఒకవైపు వాళ్లు గేమ్ ఆడుతుంటే కాజల్ పిచ్చిచేష్టలతో చిరాకు తెప్పించింది. నీకు ఆన్సర్స్ తెలిస్తే సైలెంట్‌గా ఉంటు అని శ్రీరామ్ సన్నీలు మొత్తుకున్నా.. కాజల్ వినలేదు.. నా ఇష్టం అంటూ రచ్చ చేసింది.
ఈ క్రమంలో సన్నీకి-కాజల్‌కి మధ్య గట్టిగానే ఫైట్ నడిచింది. అయితే మొత్తంగా ఈ టాస్క్‌లో ఏడు సీక్వెన్స్‌లను కరెక్ట్‌గా రాసిన మానస్-సన్నీలు విన్ కాగా.. సిరి, శ్రీరామ్‌లు ఈ టాస్క్‌లో వెనకబడ్డారు. మానస్ 25 పాయింట్లతో తొలి స్థానంలో ఉంటే.. శ్రీరామ్ 21 పాయింట్లతో రెండో స్థానంలో ఉండగా.. సిరి 19 పాయింట్లతో మూడో స్థానం.. సన్నీ 17 పాయింట్లతో చివరి స్థానంలో నిలిచాడు. అయితే హెలికాప్టర్‌కి ట్రాక్టర్ రాయడం ఏంటని షణ్ముఖ్..సిరిని హేళన చేశాడు.
కాజల్ చేసే అతిపై సన్నీ మండిపడుతూ.. నేను వద్దంటే అలా ఎందుకు చేస్తావ్.. ఎదుటి వాళ్లకి ఛాన్స్ ఎందుకు ఇస్తావ్.. అని సీరియస్ అయ్యాడు.. దీంతో ఇద్దరి మధ్య మళ్లీ గొడవమొదలైంది. కిచెన్‌లో ఇద్దరి మధ్య మాటా మాటా పెరగడంతో చేతిలో ఉన్న టిష్యూస్‌ని సన్నీ ముఖంపైకి విసిరింది కాజల్. దీంతో సన్నీ గట్టిగానే కౌంటర్ ఇచ్చాడు.. మనిషిలా బిహేవ్ చేయి.. కామన్సెన్స్ లేదా? నా ముఖంపైకి టిష్యూ విసురుతావా? నీ ప్లేస్‌లో వేరే వాడు ఉంటే అప్పుడు చెప్పేవాడ్ని అని వార్నింగ్ ఇచ్చాడు. నేను కూడా అన్ని మాటలు వేరే వాళ్లు అంటే ఊరుకునేదాన్ని కాదని కాజల్ బదులిచ్చింది.