Sunny Deol | బాలీవుడ్ అగ్ర హీరో సన్నీ డియోల్ నటిస్తున్న తాజా చిత్రం ‘జాట్’. గోపీచంద్ మలినేని దర్శకుడు. మైత్రీ మూవీ మేకర్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థలు నిర్మిస్తున్నాయి. ఏప్రిల్ 10న హిందీ, తెలుగు, తమిళ భాషల్లో ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా శుక్రవారం కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో సన్నీ డియోల్ భుజంపై భారీ తుపాకీని మోస్తూ యాక్షన్ ప్యాక్డ్ అవతారంలో కనిపిస్తున్నారు.
‘పవర్ఫుల్ యాక్షన్ డ్రామా ఇది. పోరాట ఘట్టాలు హైలైట్‌గా నిలుస్తాయి. ‘పుష్ప-2’ చిత్రంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ప్రదర్శించిన ఈ చిత్ర టీజర్‌కు మంచి స్పందన లభించింది’ అని మేకర్స్ తెలిపారు. రణదీప్ హూడా, వినీత్‌కుమార్ సింగ్, సయామీఖేర్, రెజీనా తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: తమన్, నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై.రవిశంకర్, టీజీ విశ్వప్రసాద్, రచన-దర్శకత్వం: గోపీచంద్ మలినేని.