Jaat Movie | బాలీవుడ్ నటుడు సన్నీ డియోల్ ప్రధాన పాత్రలో వచ్చిన చిత్రం జాట్ (Jaat). ఈ చిత్రానికి క్రాక్, వీరా సింహ రెడ్డి చిత్రాల దర్శకుడు గోపిచంద్ మలినేని దర్శకత్వం వహించగా.. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మించింది. ఏప్రిల్ 11న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం టాలీవుడ్లో మిక్సడ్ టాక్‌ను సొంతం చేసుకొని బాలీవుడ్లో సూపర్ హిట్‌గా నిలిచింది. అయితే ఈ సినిమాకు బాలీవుడ్లో వచ్చిన రెస్పాన్స్ వలన తాజాగా మూవీకి సీక్వెల్ తీసుకురాబోతున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై జాట్ 2 రాబోతున్నట్లు తెలిపింది.
బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించిన తర్వాత జాట్ విశ్రాంతి తీసుకోవడానికి సిద్ధంగా లేడు. ఈసారి అతను మరో పెద్ద మిషన్‌తో అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలతో మీ ముందుకు రాబోతున్నాడు అంటూ పోస్టర్‌ను విడుదల చేసింది. ఇక ఈ సినిమాకు కూడా గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించబోతున్నట్లు సమాచారం. విడుదలైన వారం రోజుల్లోనే రూ.70 కోట్ల వసూళ్లను రాబట్టింది ఈ చిత్రం. ఇందులో రణ్‌దీప్ హుడా విలన్ పాత్రలో నటించగా.. రెజినా కీలక పాత్రలో నటించింది.
#JAAT is not resting after the blockbuster at the box office 💥
He is on to a new mission. This time, the MASS FEAST will be bigger, bolder, and wilder 💪#JAAT2 ❤🔥
Starring Action Superstar @iamsunnydeol
Directed by @megopichand
Produced by @MythriOfficial &… pic.twitter.com/Cp5RMrgXuR— Mythri Movie Makers (@MythriOfficial) April 17, 2025
#JAAT enters its blockbuster second week ❤🔥#JAAT KA POWER – collects 70.4 CRORES+ DOMESTIC GBOC in 7 days 💥💥
Book your tickets for the MASS FEAST now!
▶️ https://t.co/sQCbjZ51Z6Starring Action Superstar @iamsunnydeol
Directed by @megopichand
Produced by @MythriOfficial… pic.twitter.com/QizuMJg5mt— Mythri Movie Makers (@MythriOfficial) April 17, 2025