నటుడి అపార్ట్మెంట్లో డెల్టా వేరియెంట్ కలకలం.. బిల్డింగ్ సీజ్

కరోనా బెడద ఇప్పట్లో తప్పేలా లేదు. ఒక వేవ్ తగ్గుముఖం పడుతుందని అనుకుంటున్న వేళ మరో వేవ్ మనల్ని వణికించడానికి సిద్ధమవుతుంది. ప్రస్తుతం కొన్ని చోట్ల డెల్టా ప్లస్ కేసులు వణుకు పుట్టిస్తున్నాయి. తాజాగా దేశ ఆర్ధిక రాజధాని ముంబైలో బాలీవుడ్ హీరో సునీల్ శెట్టి అపార్ట్‌మెంట్స్‌లో కరోనా కలకలం సృష్టించింది. దీంతో మున్సిపల్ అధికారులు ఆ అపార్ట్‌మెంట్‌ను సీజ్ చేశారు. కరోనా నిబంధనల ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్టు బీఎంసీ అధికారులు తెలిపారు.
బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి ముంబై, మౌంట్ రోడ్‌లోని పృథ్వీ అపార్ట్మెంట్స్లోని 18వ ఫ్లోర్లో తన ఫ్యామిలీతో ఉంటున్నారు. అయితే ఆ అపార్ట్మెంట్లో ముగ్గురికి డెల్టా వేరియెంట్ సోకినట్టు వైద్య బృందం గుర్తించింది. దీంతో కేసుల విస్తరణను అడ్డుకునే ప్రయత్నంలో ఆ భవన సముదాయాన్ని మొత్తం కూడా సీజ్ చేశామని బీఎంసీ అసిస్టెంట్ కమిషనర్ ప్రశాంత్ గైక్వాడ్ తెలిపారు. అయితే అపార్ట్మెంట్ సీజ్ చేయడంతో సునీల్ శెట్టి ఆయన భార్య, కూతురు, హీరోయిన్ అతియాశెట్టి, కుమారుడు అహాన్ శెట్టి వేరు ప్రాంతానికి వెళ్లినట్టు సమాచారం.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- corona
- delta
- sunil shetty
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

