Sunil as Kumbhakarna | చాలా రోజుల నుంచి మళ్లీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయిపోయాడు సునీల్. ఒకప్పుడు ఆయన కమెడియన్‌గా ఇండస్ట్రీకి వచ్చాడు. దాదాపు 200 సినిమాల్లో నటించిన తర్వాత అందాల రాముడు సినిమాతో హీరోగా మారాడు. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయిన కూడా మళ్లీ కమెడియన్ గానే కంటిన్యూ అయ్యాడు సునీల్. అయితే మర్యాద రామన్న సినిమా తర్వాత పూర్తి స్థాయిలో హీరోగా మారిపోయాడు. సిక్స్ ప్యాక్ కూడా చేసి యాక్షన్ సినిమాలు సైతం చేశాడు. కానీ మర్యాద రామన్న, పూలరంగడు లాంటి విజయాల తర్వాత సునీల్ కోరుకున్న హిట్స్ ఎక్కువగా రాలేదు. దాంతో మళ్లీ కమెడియన్‌గా యూ టర్న్ ఇచ్చాడు సునీల్.
గత మూడు నాలుగేళ్లుగా హీరోగా మానేసి క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా బిజీ అయిపోయాడు. మొన్న విడుదలైన అల్లు అర్జున్ పుష్ప సినిమాలో విలన్‌గా కూడా నటించాడు సునీల్. ఇందులో ఈయన పోషించిన మంగళం శ్రీను పాత్రకు మంచి అప్లాజ్ వచ్చింది. ఇదిలా ఉంటే తాజాగా మళ్లీ హీరో అవుతున్నాడు ఈయన. నిజానికి ఆ మధ్య హరీశ్ శంకర్ కథ అందించిన వేదాంతం రాఘవయ్య సినిమాతో మళ్లీ హీరోగా రీ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమయ్యాడు సునీల్. కానీ చివరి నిమిషంలో ఆ సినిమా నుంచి తప్పుకున్నాడు. ఇదిలా ఉంటే తాజాగా కుంభకర్ణ అనే సినిమాతో మళ్లీ హీరోగా అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు భీమవరం బుల్లోడు.
కుంభకర్ణ సినిమాను అభిరామ్ పిల్ల తెరకెక్కిస్తున్నాడు. సాధారణంగా కుంభకర్ణ అంటే మనకు వెంటనే గుర్తొచ్చేది నిద్ర.. కానీ ఈ సినిమాకు ట్యాగ్ లైన్ పడుకుంటే పోతాడు. ఇందులో సునీల్ క్యారెక్టర్ హిలేరియస్‌గా ఉండబోతుంది. సంగీత దర్శకుడు సాయి కార్తీక్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలు కాబోతుంది. ఈ సినిమాతో హీరోగా మళ్లీ ఫామ్‌లోకి రావాలని చూస్తున్నాడు సునీల్. ఒకవేళ ఈ సినిమా హిట్ అయితే మళ్లీ ఆ తర్వాత హీరోగా నటించడానికి సునీల్‌కు ఎలాంటి సమస్య లేకపోవచ్చు. మరి చూడాలి ఏం జరుగుతుందో.