తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్ష పదవికి సునీల్ నారంగ్ రాజీనామా
తెలుగు సినీరంగంలో గత కొంతకాలంగా పర్సంటేజీ విధానంపై డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతల మధ్య వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇండస్ట్రీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్ష పదవికి ఏషియన్ మూవీస్ అధినేత, నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ సునీల్ నారంగ్ రాజీనామా చేశారు.
తెలుగు సినీరంగంలో గత కొంతకాలంగా పర్సంటేజీ విధానంపై డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతల మధ్య వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇండస్ట్రీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్ష పదవికి ఏషియన్ మూవీస్ అధినేత, నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ సునీల్ నారంగ్ రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో తానీ నిర్ణయాన్ని తీసుకున్నానని ఆయన పేర్కొన్నారు. ఈమెయిల్ ద్వారా ఆయన ఛాంబర్‌కు రాజీనామా లేఖను పంపించారు. ‘కొందరు కార్యవర్గ సభ్యులను మెప్పించేలా నిర్ణయాలు తీసుకోవాలని నాపై ఒత్తిడి తెస్తున్నారు.
ఇకపై నేను ఆ విధంగా చేయలేను. అలాగే నాకు ఆరోగ్యం కూడా సహకరించడం లేదు. ప్రతి నిర్ణయంలో ఛాంబర్ ఏకాభిప్రాయంతో నడచుకోవాలి. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అలా జరగడం లేదు’ అని రాజీనామా లేఖలో సునీల్ నారంగ్ పేర్కొన్నారు. ఆయన రాజీనామాను ఫిల్మ్ ఛాంబర్ ఆమోదించింది. పర్సంటేజీ విధానంపై నడుస్తున్న తీవ్ర చర్చలు, ఈ నేపథ్యంలో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాల వల్లే సునీల్ నారంగ్ రాజీనామా చేశారని అంటున్నారు. పర్సంటేజీ సమస్యను పరిష్కరించడానికి ఈమధ్యే తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఓ సబ్‌కమిటీని నియమించింది. రెండు నెలల్లో ఈ కమిటీ నివేదికను సమర్పించనుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nobel Prize: ఆర్థికశాస్త్రంలో ఇద్దరికి ఈయేటి నోబెల్ పురస్కారం
Thyroid Problem | థైరాయిడ్ సమస్య ఉన్నవారికి రోబోటిక్ శస్త్ర చికిత్స ఉపయోగకరమేనా.. నిపుణులు ఏమంటున్నారు..?
‘నాంపల్లిని కరువు మండలంగా ప్రకటించాలి’
Mayor Reservations | ఏపీలో మేయర్ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు చేస్తూ ఉత్తర్వులు
Jobs | నేవల్ డాక్‌యార్డ్, ఎయిర్‌క్రాఫ్ట్ యార్డ్‌లో 210 అప్రెంటిస్ ఖాళీలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

