Oscars 2025 | కన్నడ జానపద కథ ఆధారంగా రూపొందించిన లఘు చిత్రం ‘సన్‌ఫ్లవర్స్ వర్ ది ఫస్ట్ వన్ టు నో’ ఆస్కార్ బరిలో నిలిచింది. లైవ్ యాక్షన్ విభాగంలో ఈ షార్ట్‌ఫిల్మ్‌ను ఎంపిక చేశారు. 16 నిమిషాల నిడివిగల ఈ లఘు చిత్రానికి చిదానంద దర్శకత్వం వహించారు.
ఒక గ్రామంలో వృద్ధురాలు ఓ కోడిని దొంగిలిస్తుంది. ఈ విషయంలో ఆమెతో గ్రామస్తులు పంచాయతీకి దిగుతారు. ఈ క్రమంలో జరిగే సంఘటనలేమిటన్నదే చిత్ర ఇతివృత్తం. పలు అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో ఈ షార్ట్ ఫిల్మ్ అవార్డులను గెలుచుకుంది. ప్రతిష్టాత్మక కేన్స్ చిత్రోత్సవంలో ఈ ఏడాది వివిధ దేశాలకు చెందిన లఘు చిత్రాలతో పోటీపడి మొదటి బహుమతి గెలుచుకుంది. బెంగళూరు ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్లో కూడా విజేతగా నిలిచింది. షార్ట్‌ఫిల్మ్ కేటగిరీలో ఈ సినిమా ఆస్కార్‌కు ఎంపికయ్యే అవకాశాలున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. 2025 ఆస్కార్‌కు గాను భారత్ నుంచి ‘లాపతా లేడీస్’ చిత్రం అధికారికంగా ఎంపికై విషయం తెలిసిందే.