హీరో సందీప్‌కిషన్ ఇటీవలే ‘మజాకా’ సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన చేతిలో రెండుమూడు ప్రాజెక్టులున్నాయి. తమిళంలో కూడా సినిమాలు చేసున్నారాయన. రీసెంట్గా దర్శకుడు శ్రీవాసు ఆయనకు ఓ కథ వినిపించారట.
సందీప్‌కి కూడా ఆ కథ నచ్చిందని ఫిల్మ్ వర్గాల సమాచారం. ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన వివరాలు త్వరలో తెలియనున్నాయి. నిజానికి రవితేజ కోసం శ్రీవాసు ఈ కథ రాశారట. రవితేజ కూడా కథను ఓకే చేశారట. ఈ సినిమాను నిర్మించేందుకు ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ ముందుకొచ్చిందట. కానీ ఎందుకో ఆ ప్రాజెక్ట్ నుంచి రవితేజ తప్పుకున్నట్టు సమాచారం.