సందీప్‌కిషన్ కథానాయకుడిగా వి.ఐ.ఆనంద్ దర్శకత్వంలో రూపొందిస్తున్న ఫాంటసీ చిత్రానికి ‘ఊరు పేరు భైరవకోన’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రాజేష్ దండా నిర్మిస్తున్నారు. శనివారం సందీప్‌కిషన్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని సినిమా టైటిల్‌తో పాటు ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ఇందులో సందీప్‌కిషన్ ఓ కాల్పనిక ప్రపంచంలో నిల్చొని చేతిలో మంత్రదండం పట్టుకొని కనిపిస్తున్నాడు.
పోస్టర్‌ను చూస్తే విభిన్నమైన ఫాంటసీ కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారని అర్థమవుతున్నది. గ్రాఫిక్స్ ప్రధానంగా సాగే ఈ చిత్రం ప్రేక్షకులకు సరికొత వీక్షానుభూతిని అందిస్తుందని చిత్రబృందం పేర్కొంది. కావ్యథాపర్, వర్ష బొల్లమ్మ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: రాజ్ తోట, సంగీతం: శేఖర్‌చంద్ర, నిర్మాణ సంస్థలు: ఏకే ఎంటర్టైన్మెంట్స్, హాస్య మూవీస్, సమర్పణ: అనిల్ సుంకర, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వీఐ ఆనంద్.