బుధవారం 03 జూన్ 2020
Cinema - May 07, 2020 , 23:28:29

సందీప్‌కిషన్‌ కొత్త చిత్రం

సందీప్‌కిషన్‌ కొత్త చిత్రం

సందీప్‌కిషన్‌ కథానాయకుడిగా ఆనంది ఆర్ట్‌ క్రియేషన్స్‌ సంస్థ ఓ చిత్రాన్ని రూపొందించనుంది. రామ్‌ అబ్బరాజు దర్శకత్వం వహిస్తారు. భాను భోగవరపు కథనందిస్తున్నారు. నేడు సందీప్‌కిషన్‌ జన్మదినం సందర్భంగా ఈ సినిమా ప్రకటన చేశారు. ‘సందీప్‌కిషన్‌ హీరోగా గతంలో మా సంస్థ వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌, బీరువా సినిమాల్ని తెరకెక్కించింది. తాజా సినిమాను అందమైన ఫ్యామిలీ, రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందించబోతున్నాం. ప్రస్తుతం సందీప్‌కిషన్‌ కథానాయకుడిగా నటిస్తున్న ‘ఏ1 ఎక్స్‌ప్రెస్‌' చిత్ర నిర్మాణ పనులు చివరి దశలో ఉన్నాయి. ఆ సినిమా పూర్తయిన వెంటనే ఆనంది ఆర్ట్స్‌ క్రియేషన్స్‌ చిత్రం సెట్స్‌మీదకు వెళ్తుంది’ అని నిర్మాత పి.కిరణ్‌ తెలిపారు.


logo