Majaka | సందీప్‌కిషన్, రీతూవర్మ జంటగా నటిస్తున్న చిత్రం ‘మజాకా’.త్రినాథరావు నక్కిన దర్శకుడు. రాజేష్ దండ నిర్మాత. ఫిబ్రవరి 21న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నేపథ్యంలో ప్రచారంలో జోరు పెంచారు. బుధవారం బ్యాచిలర్ యాంథమ్ పాటను విడుదల చేశారు. బ్యాచిలర్స్ జీవితంలో ఉండే సరదాలు, కష్టాలను ఈ పాటలో చూపించారు.
లియోన్ జేమ్స్ స్వరపరచిన ఈ పాటను రామజోగయ్యశాస్త్రి రచించారు. ధనుంజయ్ సీపాన ఆలపించారు. యువతను హుషారెత్తించే గీతమిదని, వైజాగ్ బీచ్‌లో ఈ పాటను తెరకెక్కించామని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి కథ, కథనం, సంభాషణలు: ప్రసన్నకుమార్ బెజవాడ, నిర్మాతలు: రాజేష్ దండ, ఉమేష్ కేఆర్ బన్సల్, దర్శకుడు: త్రినాథరావు నక్కిన.