‘ఫ్యామిలీ ఎమోషన్స్‌తో కూడిన పూర్తి వినోదాత్మక చిత్రం ఇది. ముఖ్యంగా ఇంటర్వెల్ ట్విస్ట్ అద్భుతంగా ఉంటుంది. అది సెకండాఫ్‌ని లీడ్ చేస్తుంది. అదే సినిమాకి హైలైట్. సందీప్‌కిషన్, రావురమేష్ సీన్స్ ఆడియన్స్‌ని ఓ రేంజ్లో నవ్విస్తాయి. అలాగే సందీప్, రీతూ లవ్‌స్టోరీ, రావురమేష్, అన్షూ లవ్ ట్రాక్ కూడా బాగా అలరిస్తాయి. ఇది సందీప్‌కి ‘భైరవకోన’ కంటే బెటర్ సినిమా అవుతుంది.’ అని నిర్మాత రాజేష్ దండా నమ్మకం వ్యక్తం చేశారు.
సందీప్‌కిషన్ కథానాయకుడిగా, నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో ఆయన నిర్మించిన చిత్రం ‘మజాకా’. రావురమేష్ కీలక పాత్ర పోషించిన ఈ చిత్రంలో రీతూవర్మ, అన్షూ కథానాయికలు. మహాశివరాత్రి కానుకగా రేపే సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా సోమవారం రాజేష్ దండా విలేకరులతో ముచ్చటించారు. ‘ఒక సెలబ్రేషన్ వైబ్ ఉన్న సినిమా ఇది. అందుకే ‘మజాకా’ అనే టైటిల్ పెట్టాం.
దర్శకుడు నక్కిన త్రినాథరావుతో పనిచేయడం గొప్ప అనుభవం. సినిమాను అద్భుతంగా తీశారాయన. ఆయనతో మరో సినిమా చేస్తాం. ఇదే సినిమాకు సీక్వెల్ చేయాలని ఉంది. అందుకే ఎండింగ్లో ‘డబుల్ మజాకా’ అని టైటిల్ కూడా వేశాం.’ అని తెలిపారు రాజేష్ దండా.
‘తండ్రీకొడుకు మాత్రమే ఉండే ఓ ఇల్లు. ఎలాగైనా ఆ ఇంట్లో ఓ ఫ్యామిలీ ఫొటో పెట్టుకోవాలి. ఇదీ ఆ తండ్రీకొడుకుల తపన. ఇలాంటి బ్యూటిఫుల్ ఎమోషన్‌తో ఆద్యంతం కామెడీగా సినిమా సాగుతుంది. కొందరు శ్రేయోభిలాషులకు సినిమా చూపించాం. అందరూ బావుందని చెప్పారు. నేనేదైతే నమ్మానో అది కచ్చితంగా వర్కవుట్ అవుతుంది.’ అని రాజేష్ దండా నమ్మకంగా చెప్పారు.