Sundaram Barthhday Homam | ‘వీళ్ల చాదస్తం తగలెయ్య’..సుందరం హోమం స్పెషల్ వీడియో
వివేక్ ఆత్రేయ (Vivek Athreya) డైరెక్షన్ లో రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్‌గా తెరకెక్కుతున్న చిత్రం అంటే సుందరానికి (Ante Sundaraniki). నేడు ఫిబ్రవరి 24న నాని పుట్టినరోజు జరుపుకోవడం సందర్భంగా స్పెషల్ వీడియోను విడుదల చేస్తున్నట్టు మేకర్స్ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.
టాలీవుడ్ స్టార్ హీరో నాని (Nani) నటిస్తోన్న తాజా చిత్రం అంటే సుందరానికి (Ante Sundaraniki). వివేక్ ఆత్రేయ (Vivek Athreya) డైరెక్షన్ లో రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నజ్రియా నజీమ్ (Nazriya Nazim) ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తుంది. తన క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తో కోట్లాది మంది మనసు దోచుకున్న నజ్రియాకు ఇది తొలి టాలీవుడ్ ప్రాజెక్టు కావడం విశేషం. నేడు ఫిబ్రవరి 24న నాని పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ వీడియోను మేకర్స్ విడుదల చేశారు.
ఈ నేపథ్యంలో ‘పుట్టినరోజున ఏంటే ఇది..ఇంకెన్ని హోమాలు చేయాలే..వీళ్ల చాదస్తం తగలెయ్య..ఇంకో రెండు హోమాలు చేసినట్టైతే అన్ని హోమాలు చేసినట్టు గిన్నీస్ బుక్‌లోకి ఎక్కొచ్చు ‘ అంటూ మెడలో తెల్ల టవాలు, భుజానికి జంధ్యం, చేతులకు నామాలు, నుదిటన బొట్టుతో చిన్న పిల్లాడిలా కనిపిస్తున్న నాని చెబుతున్న డైలాగ్స్ ఫన్నీగా సాగుతూ క్యూరియాసిటీని పెంచుతున్నాయి.
వివేక్ ఆత్రేయ ఈ చిత్రంలో నానిలోని కొత్త యాంగిల్‌ను అభిమానులకు చూపించబోతున్నాడని తాజా వీడియోతో అర్థమవుతుంది. ఈ చిత్రానికి వివేక్ సాగర్ మ్యూజిక్ డైరెక్టర్..కాగా నదియా, హర్షవర్దన్, సుహాస్, రాహుల్ రామకృష్ణ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని జూన్ 10న గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు.
Srikanth Meka | స్టార్ డైరెక్టర్ కోసం శ్రీకాంత్ వేట..ఇంతకీ ఎవరి కోసమో..?
Mangalyam Song | ఫ్రస్టేషన్ తో పాట పాడుకుంటున్న శర్వానంద్..లిరికల్ వీడియో
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

