Srikanth Meka | స్టార్ డైరెక్టర్ కోసం శ్రీకాంత్ వేట..ఇంతకీ ఎవరి కోసమో..?
శ్రీకాంత్ (Srikanth Meka) కుమారుడు రోషన్ (Roshan)ను గతేడాది దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు పెళ్లి సందD (PelliSandaD) సినిమాతో హీరోగా రీ లాంఛ్ చేశారు. అయితే ఈ చిత్రం పాటలు మినహా ఆశించిన విజయాన్ని అందుకోలేక బాక్సాపీస్ వద్ద బోల్తా పడ్డది.
సినీ పరిశ్రమలో వారసుల ఎంట్రీ కొత్తేమి కాదు. సీనియర్ హీరోల కొడుకులు ఇండస్ట్రీకి వచ్చి రాణిస్తున్న వారూ ఉన్నారు..కెరీర్ డైలామాలో పడ్డ వారూ ఉన్నారు. ఇప్పడిపుడు కెరీర్ పై ఫోకస్పెడుతున్న వారున్నారు. ఈ జాబితాలో ముందుంటాడు శ్రీకాంత్ (Srikanth Meka) కుమారుడు రోషన్ (Roshan). గతేడాది దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు పెళ్లి సందD (PelliSandaD) సినిమాతో రోషన్‌ను హీరోగా రీ లాంఛ్ చేశారు. అయితే ఈ చిత్రంలో పాటలు మినహా ఆశించిన విజయాన్ని అందుకోలేక బాక్సాపీస్ వద్ద బోల్తా పడ్డది. దీంతో లీడ్ రోల్ చేసిన రోషన్ కు గుర్తింపు కరువైంది.
రోషన్ గతంలోనే నిర్మలా కాన్వెంట్ స్కూల్, రుద్రమదేవి సినిమాలతో టాలెంటెడ్ యాక్టర్ గా ప్రూవ్ చేసుకున్నప్పటికీ ఏ స్టార్ డైరెక్టర్ (Star Director) అతడితో సినిమా చేసేందుకు రెడీ లేరట. ఈ టాలీవుడ్ యంగ్ హీరో చేతిలో ప్రస్తుతం 4 సినిమాలు ఉన్నాయని తెలుస్తోండగా..కొత్త డైరెక్టర్లు, సీనియర్ కో డైరెక్టర్లు ఈ సినిమాలను తెరకెక్కించే జాబితాలో ఉన్నారట. పెద్ద డైరెక్టర్ ఎవరూ రోషన్‌తో సినిమా చేయడానికి అందుబాటులో లేరట. ఈ నేపథ్యంలో శ్రీకాంత్ తన కొడుకు రోషన్‌తో సినిమా చేయడం కోసం కేవలం స్టార్ డైరెక్టర్ అయినా లైన్ లో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నాడని టాక్.

లేటెస్ట్ టాక్ ప్రకారం శ్రీకాంత్ అగ్ర నిర్మాణ సంస్థలు గీతా ఆర్ట్స్, సురేశ్ ప్రొడక్షన్స్ తో ఈ మేరకు చర్చలు కూడా జరుపుతుండగా..త్వరలోనే దీనిపై ఓ క్లారిటీ రానుందని ఇన్సైడ్ టాక్. మరి రోషన్‌ను ఏ స్టార్ డైరెక్టర్ హ్యాండిల్ చేస్తాడో చూడాలి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

