Kubera | టాలీవుడ్ దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కించిన తాజా చిత్రం ‘కుబేర’ ఇటీవల రిలీజ్ అయిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర సందడి చేస్తోంది. ఈ సినిమాలో అక్కినేని నాగార్జున, ధనుష్, రష్మిక మందన్న లీడ్ రోల్స్‌లో నటించారు. ఎమోషనల్ కంటెంట్‌గా రూపొందిన ఈ చిత్రాన్ని పాన్ ఇండియా భాషల్లో విడుదల చేశారు. చిత్రానికి మంచి ఆదరణ లభించింది. అయితే ఈ మూవీకి తమిళంలో కన్నా తెలుగులో ఎక్కువ ఆదరణ దక్కడం విశేషం. ధనుష్ లాంటి యాక్టర్ ఉన్నా కూడా ఈ సినిమాను అక్కడి ప్రేక్షకులు ఎందుకో తిరస్కరించారు. ధనుష్ లాంటి స్టార్ నటుడు ఈ సినిమాలో ఉండడంతో అక్కడి వారికి ఈజీగా కనెక్ట్ అవుతుందని భావించామని.. కాని ఫలితం చూసి తాము ఏ విషయంలో తప్పు చేశామో తెలుసుకోవాల్సిన పరిస్థితి ఉందని శేఖర్ కమ్ముల ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు.
ధనుష్ బిచ్చగాడిగా నటించిన తీరు, ఒక పేదవాడి నుంచి ధనవంతుడిగా మారే ప్రయాణం, శేఖర్ కమ్ముల నరేటివ్ స్టైల్ ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.ఈ సినిమాలో అక్కినేని నాగార్జున కీలక పాత్రలో కనిపించి, మరోసారి తన నటనతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేశారు. అయితే నాగార్జున భార్యగా సినిమాలో కనిపించిన ఆ చిన్నదాని పాత్ర గుర్తుందా? నటన పరంగా కొంత సమయం మాత్రమే స్క్రీన్‌పై కనిపించినా, తన నటనతో ప్రత్యేకంగా గుర్తింపు తెచ్చుకుంది. ఆమె ఎవరో తెలుసా? పేరు సునయన కాగా, తెలుగు ప్రేక్షకులకి కొత్తేమి కాదు.
2005లో వచ్చిన ‘సంథింగ్ స్పెషల్’ సినిమాతో టాలీవుడ్లో పరిచయమైన ఈ ముద్దుగుమ్మ ఆ తరువాత ‘10th క్లాస్’ సినిమాతో ఆకట్టుకుంది. అయితే తమిళ్ ఇండస్ట్రీలో ఎక్కువగా సినిమాలు చేసిన ఈ బ్యూటీ, అడపాదడపా తెలుగులోనూ కనిపిస్తూ ఆకట్టుకుంటోంది. ఇటీవల ‘రాజరాజ చోర’ సినిమాలోనూ మంచి పాత్ర చేసింది. ఇప్పుడు ‘కుబేర’ సినిమాలో నాగార్జున భార్యగా నటించి తన నటనతో మెప్పించింది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే సునయన, తన అందమైన ఫోటోలతో నిత్యం అభిమానులను ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కుబేరలో సునయనకి బయట సునయనకి పొంతనే లేదుగా అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.