బిగ్‌బాస్ ఫేమ్ అమర్దీప్ చౌదరి, సయాలీ, టేస్టీ తేజ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘సుమతీ శతకం’. ఎం.ఎం.నాయుడు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి కొమ్మాలపాటి సాయి సుధాకర్ నిర్మాత. శనివారం కథానాయిక సయాలీ పాత్రకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు.
‘గ్రామీణ ప్రేమకథా చిత్రమిది. వింటేజ్ విలేజ్ డ్రామాగా ఆకట్టుకుంటుంది. కథ, కథనాలు సరికొత్తగా ఉంటాయి. దసరాకు విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’ అని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: సుభాష్ ఆనంద్, సంభాషణలు: బండారు నాయుడు, దర్శకత్వం: ఎం.ఎం.నాయుడు.