సుమతి ఎమోషనల్ జర్నీ
రంగస్థలం’లో రంగమ్మత్తగా, ‘పుష్ప’లో దాక్షాయణిగా అలరించిన నటి అనసూయ భరద్వాజ్ ‘విమానం’ చిత్రంలో మరో విభిన్న పాత్రలో మెప్పించడానికి సిద్ధమవుతున్నది.
‘రంగస్థలం’లో రంగమ్మత్తగా, ‘పుష్ప’లో దాక్షాయణిగా అలరించిన నటి అనసూయ భరద్వాజ్ ‘విమానం’ చిత్రంలో మరో విభిన్న పాత్రలో మెప్పించడానికి సిద్ధమవుతున్నది. ఆమె నటిస్తున్న ఈ తాజా చిత్రంలో సుమతిగా వైవిధ్యమైన పాత్రలో కనిపించనుంది. ఆమె పాత్రకు సంబంధించిన లిరికల్ వీడియోను ఈ నెల 22న విడుదల చేస్తున్నారు. సముద్రఖని, అనసూయ భరద్వాజ్, మాస్టర్ ధ్రువన్, మీరాజాస్మిన్ ముఖ్యపాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘విమానం’. శివప్రసాద్ యానాల దర్శకుడు. జీస్టూడియోస్‌తో కలిసి కిరణ్ కొర్రపాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జూన్ 9న తెలుగు, తమిళ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ‘వైవిధ్యమైన కథాంశమిది. ఎమోషనల్ జర్నీగా ఆకట్టుకుంటుంది. అనసూయ పాత్ర బోల్డ్‌గా ఉంటూనే ఎమోషనల్ టచ్‌తో సాగుతుంది. అంగవైకల్యం ఉన్న తండ్రి పాత్రలో సముద్రఖని నటన అందరి మనసుకు హత్తుకుంటుంది’ అన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nobel Prize: ఆర్థికశాస్త్రంలో ఇద్దరికి ఈయేటి నోబెల్ పురస్కారం
Thyroid Problem | థైరాయిడ్ సమస్య ఉన్నవారికి రోబోటిక్ శస్త్ర చికిత్స ఉపయోగకరమేనా.. నిపుణులు ఏమంటున్నారు..?
‘నాంపల్లిని కరువు మండలంగా ప్రకటించాలి’
Mayor Reservations | ఏపీలో మేయర్ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు చేస్తూ ఉత్తర్వులు
Jobs | నేవల్ డాక్‌యార్డ్, ఎయిర్‌క్రాఫ్ట్ యార్డ్‌లో 210 అప్రెంటిస్ ఖాళీలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

