టాలీవుడ్‌కు హిట్ చిత్రాలనందించిన నిర్మాత ఎంఎస్ రాజు (MS Raju) డైరెక్ట్ చేస్తున్న మరో చిత్రం 7 డేస్ 6 నైట్స్ (7 Days 6 Nights). సుమంత్ అశ్విన్ (Sumanth Ashwin), మెహర్ చావల్, రోహన్, కృతిక శెట్టి కాంబినేషన్లో వస్తున్న ఈ చిత్రం జూన్ 24న (రేపు) ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ లో బిజీగా ఉంది సుమంత్ అశ్విన్ టీం.
ప్రమోషన్స్ లో భాగంగా హైదరాబాద్‌లోని చారిత్రక కట్టడం ఛార్మినార్‌ను సందర్శించింది చిత్రయూనిట్. ఎంఎస్ రాజుకు చార్మినార్‌కు మధ్య మంచి అనుబంధం ఉందని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఒక్కడు సినిమా కోసం ఏకంగా చార్మినార్ సెట్టు వేయించి అప్పట్లో టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచారు ఎంఎస్ రాజు. చార్మినార్ పరిసర ప్రాంతాల్లో చక్కర్లు కొడుతూ ఛాయ్ తాగారు. ఐస్‌క్రీమ్ తిన్నారు.
రేపు మా సినిమా విడుదలవుతుంది. అందరూ థియేటర్లలోనే చూసి..ఎంజాయ్ చేయాలని సుమంత్ టీం కోరింది. ఈ చిత్రాన్ని సుమంత్ ఆర్ట్స్ ప్రొడక్షన్స్ సమర్పణలో వైల్డ్ హనీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై వింటేజ్ పిక్చర్స్, ఏబీజీ క్రియేషన్స్ తో కలిసి సుమంత్ అశ్విన్, ఎస్ రజినీకాంత్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సమర్థ్ గొల్లపూడి (Samarth Gollapudi) సంగీతం అందిస్తున్నాడు.
Remembering #Okkadu memories at Charminar, young team of fun film #7Days6Nights seem confident about the response to their film ✨@SumanthArtPro @MSRajuOfficial@MSumanthAshwin @RajnikantSOffl @SamarthGollapu5 @WildHoneyPro #WintagePictures @AbgCreations @PulagamOfficial pic.twitter.com/veBrznxrka
— Sumanth Art Productions (@SumanthArtPro) June 23, 2022