సుమన్, భూషణ్, అంకిత, పద్మిని ప్రధాన పాత్రల్లో కేఎల్పీ మూవీస్ ప్రొడక్షన్స్ సంస్థ ఓ చిత్రాన్ని రూపొందిస్తున్నది. జీఎల్బీ శ్రీనివాస్ దర్శకుడు. నిర్మాత కాయగూరల లక్ష్మీపతి చిత్ర విశేషాలు తెలియజేస్తూ ‘ఈ నెల 19 నుంచి సిని మా మొదలుపెడతాం.
మెడికల్ కాన్సెప్ట్ నేపథ్యంలో తెరకెక్కించబోతున్నాం. సుమన్ పాత్ర ఆకట్టుకుంటుంది’ అన్నారు. ఈ సినిమాలో తాను పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్లో నటించబోతున్నానని సీనియర్ నటుడు సుమన్ తెలిపారు. పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని రూపొందించబోతున్నట్లు దర్శకుడు పేర్కొన్నారు.