Suma Kanakala |బుల్లితెరపై తన ప్రత్యేకమైన క్రేజ్‌తో కొన్ని సంవత్సరాలుగా దూసుకుపోతున్న యాంకర్ సుమ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తన వాక్చాతుర్యం, కామెడీ పంచ్‌లతో ప్రత్యేకమైన ఇమేజ్ సంపాదించుకుంది సుమ. కొత్త యాంకర్స్ వచ్చినప్పటికీ తన స్థానం పదిలపరుచుకుంటూ, పెద్ద సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్స్, వివిధ మూవీ కార్యక్రమాల్లో హోస్ట్‌గా కొనసాగుతోంది. యాంకర్‌గా మాత్రమే కాదు, వీలైనపుడు వెండితెరపై నటిస్తూ కూడా అభిమానులను అలరిస్తుంది. ఇప్పటికే పలు సినిమాల్లో కీలక పాత్రలు పోషించిన సుమ, 2022లో విడుదలైన “జయమ్మ పంచాయతీ” లో టైటిల్ రోల్ చేసిన సంగతి తెలిసిందే. సినిమా బాక్స్ఆఫీస్ వద్ద పెద్ద హిట్ సాధించలేకపోయినా, ఆమె పాత్రకు, యాక్టింగ్‌కు మంచి మార్కులు లభించాయి.
తాజాగా సుమ మరోసారి వెండితెరపై నటించడానికి సిద్ధమైంది. ఆమె కీలక పాత్రలో నటిస్తున్న సినిమా “ప్రేమంటే”. ఇందులో కమెడియన్ ప్రియదర్శి హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాతో నవనీత్ శ్రీరామ్ దర్శకుడిగా పరిచయం కావడం విశేషం. థ్రిల్లింగ్ రొమాంటిక్ డ్రామా శైలి ఉన్న ఈ చిత్రంలో సుమ కీలక పాత్ర పోషిస్తోంది. కొద్ది రోజుల క్రితం జరిగిన ఈ మూవీ పూజా కార్యక్రమానికి స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా, హీరో రానా ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కార్యక్రమంలో రానా ముహూర్తపు సన్నివేశానికి ఫస్ట్ క్లాప్ కొట్టగా, సందీప్ రెడ్డి వంగా కెమెరా స్విచ్ చేశారు. సినిమా రానా సమర్పణలో రూపొందుతుంది. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, స్పిరిట్ మీడియా బ్యానర్లపై, జాన్వి నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్‌రావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సంగీతం లియోన్ జేమ్స్ అందిస్తున్నారు.
చిత్రంలో ప్రియదర్శి, ఆనంది హీరోయిన్లుగా నటిస్తుండగా, సుమ కీలక పాత్ర పోషిస్తోంది. తాజాగా సుమకి సంబంధించిన పోస్టర్ ఒకటి బయటకు రాగా, ఇందులో సుమ పోలీస్ గెటప్‌లో కనిపిస్తుంది. సాధారణ పోలీసు కాదు, నవ్వించడానికి సిద్ధమైంది.ఆమె కామెడీ టైమింగ్‌ని బిగ్ స్క్రీన్‌పై చూడబోతున్నాం అంటూ విడుదలైన పోస్టర్ నెట్టింట వైరల్ అవుతుంది. ఆషా మేరీ పాత్రలో కనిపించి సుమ సందడి చేయనుంది. ఇక ఇదిలా ఉంటే అనీష్ హీరోగా స్వీయ దర్శకత్వంలో రానున్న లవ్ ఓటీపీ చిత్ర ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో పాల్గొన్న రాజీవ్ కనకాల.. ఇందులో తన భార్యగా సుమను నటించమని అడిగితే ఒప్పుకోలేదని ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.