Kgf Chapter-2 | ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర ‘కేజీఎఫ్ చాప్టర్-2’ ఎలాంటి విధ్వంసాలను సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు . సౌత్ నార్త్ అని తేడా లేకుండా విడుదలైన ప్రతి భాషలో వసూళ్ళ వర్షాన్ని కురిపించింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఇటీవలే 1200కోట్ల మార్క్‌ను అధిగమించి రికార్డు సృష్టించింది. మరీ ముఖ్యంగా బాలీవుడ్లో ఈ చిత్రం సరికొత్త రికార్డులను క్రియేట్ చేసింది. కలెక్షన్లలో ఖాన్, కపూర్లను సైతం వెనక్కి నెట్టి రాఖీ బాయ్ టాప్ ప్లేస్‌లో నిలిచాడు. చిత్రం విడుదలై నెల రోజులు దాటిన కలెక్షన్లలో మాత్రం జోరు తగ్గడం లేదు. ఈ సినిమా విజయంలో రవిబస్రూర్ ముఖ్య పాత్ర వహించాడు అనడంలో సందేహమే లేదు. ఈ చిత్రంలో పాటులు గాని బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ గాని సినిమాను మరో లెవల్‌కు తీసుకెళ్ళాయి.
‘కేజీఎఫ్’ చిత్ర బృందం గత రెండు వారాల నుంచి ప్రతి వారం ఒక వీడియో సాంగ్‌ను విడుదల చేస్తుంది. ఈ క్రమంలోనే కేజీఎఫ్-2 నుంచి ‘సుల్తానా’ వీడియో సాంగ్‌ను మేకర్స్ తాజాగా విడుదల చేశారు. రామజోగయ్యశాస్త్రీ సాహిత్యం అందించిన ఈ పాటను శ్రీ కృష్ణ, పృథ్వీ చంద్ర, హరిణి తదితరులు ఆలపించారు. ద్వితియార్థంలో వచ్చే ఈ పాట సినిమాకే హైలెట్‌గా నిలిచింది. ఇదివరకే చిత్రం నుంచి విడుదలైన మూడు పాటలకు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వచ్చింది. యష్‌కు జోడీగా శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటించింది. బాలీవుడ్ స్టార్ సంజయ్‌దత్, రవీనా టాండన్ కీలక పాత్రలో నటించారు. హోంబలే ఫిలింస్ బ్యానర్‌పై విజయ్ కిరగందూర్ ఈ చిత్రాన్ని నిర్మించాడు.