యశ్వంత్ యజ్జవరుపు, త్రిప్తి శంకర్ ముఖ్యపాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘ఓయ్ ఇడియట్’. వెంకట్ కడలి దర్శకుడు. సత్తిబాబు మోటూరి, శ్రీనుబాబు పుల్లేటి నిర్మాతలు. త్వరలోనే చిత్రం విడుదల కానుంది. ఇటీవల ఈ చిత్ర బృందం ప్రముఖ దర్శకుడు సుకుమార్‌ను కలిసింది. సినీ పరిశ్రమకు నూతన టాలెంట్‌ను పరిచయం చేసే సినిమాలు రావాలని..ఈ కోవలోనే రూపొందిన ‘ఓయ్ ఇడియట్’ సినిమా విజయం సాధించాలని సుకుమార్ ఆకాంక్షించారు.