Kumari 21F Sequel | చిన్న సినిమాగా వచ్చి బాక్సాఫీస్‌ను షేక్ చేసిన సినిమాల్లో టాప్‌లో ఉంటుంది కుమారి 21 ఎఫ్. ముంబై భామ హెబ్బా పటేల్ తెలుగులో లీడ్ హీరోయిన్గా తొలిసారి ఈ సినిమాతో సూపర్ హిట్టందుకుంది. రాజ్ తరుణ్ హీరోగా నటించిన ఈ మూవీని పల్నాటి సూర్య ప్రతాప్ డైరెక్ట్ చేయగా.. పాపులర్ రైటర్ కమ్ డైరెక్టర్ సుకుమార్ కథనందించాడు. అప్పట్లో ట్రెండ్ సెట్టర్‌గా నిలిచిన ఈ మూవీకి సీక్వెల్ రాబోతుందన్న వార్త ఇప్పుడు మూవీ లవర్స్‌ను ఫుల్ ఖుషీ చేస్తోంది.
ఫిలింనగర్ సర్కిల్ కథనాల ప్రకారం కుమారి 21F సీక్వెల్‌కు కుమారి 22F టైటిల్ కూడా ఫిక్స్ చేశారట. ఈ సినిమాను సుకుమార్ సతీమణి తబిత సుకుమార్ తన కొత్త ప్రొడక్షన్ బ్యానర్లో నిర్మించనుండటం విశేషం. త్వరలోనే ఈ క్రేజీ సీక్వెల్ ప్రకటన ఉండబోతున్నట్టు ఇన్సైడ్ టాక్. చివరగా 18 పేజెస్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు డైరెక్టర్ పల్నాటి సూర్య ప్రతాప్. మరి కుమారి 22Fను పల్నాటి సూర్య ప్రతాప్ డైరెక్ట్ చేస్తాడా..? లేదంటే కొత్త దర్శకుడు ఈ ప్రాజెక్టును టేకోవర్ చేస్తాడా.. ? అనేది తెలియాల్సి ఉంది.
సీక్వెల్లో కూడా హెబ్బా పటేల్ టైటిల్ రోల్లో కనిపిస్తుందా అనేది క్లారిటీ రావాల్సి ఉంది. మరి సుకుమార్ సీక్వెల్ కోసం ఎలాంటి స్టోరీ సిద్దం చేశాడనేది ఆసక్తికరంగా మారింది. సీక్వెల్‌పై రాబోయే రోజుల్లో ఏదైనా అధికారిక ప్రకటన వస్తుందనేది చూడాలి. కాగా సుకుమార్ ప్రస్తుతం రాంచరణ్‌తో చేయబోతున్న సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాడు.
Shreyas Talpade | భారీ పెట్టుబడి మోసం కేసు .. చిక్కుల్లో బాలీవుడ్ నటులు శ్రేయస్ తల్పడే, అలోక్ నాథ్
The Girlfriend Trailer | రష్మిక మందన్నా ‘ది గర్ల్‌ఫ్రెండ్’ ట్రైలర్ విడుదల
Srinu Vaitla | శ్రీను వైట్లకి హీరో దొరికాడా..ఈ సారి గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడుగా..!