Sukumar Home Helper | దర్శకుడు సుకుమార్ ప్రస్తుతం ఫుల్ బిజీగా గడుపుతున్న విషయం తెలిసిందే. ఆయన దర్శకత్వంలో వస్తున్న పుష్ప 2 చిత్రం మరికొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇదిలావుంటే సుకుమార్ ఇంట్లో సందడి వాతావరణం నెలకొంది. పుష్ప2 రిలీజ్‌కు ఇంకా సమయం ఉండగానే వాళ్ళ ఫ్యామిలీ లో జరిగిన హ్యాపీ మూమెంట్‌ను సుకుమార్ భార్య సోషల్ మీడియా వేదికగా పంచుకుంది.
సుకుమార్ ఇంట్లో పనిచేసే దివ్య అనే యువతికి ప్రభుత్వ ఉద్యోగం దక్కింది. ఈ విషయాన్ని సుకుమార్ భార్య బబిత వెల్లడించింది. మా ఇంట్లో హెల్పర్‌గా చేసిన దివ్య ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ తెచ్చుకుంది. ఈ విషయం మీ అందరితో పంచుకోవాలి అనుకుంటున్నా అంటూ బబిత వెల్లడించింది. ఇక దివ్యకి ఉద్యోగం రావడంపై సుకుమార్, అతడి భార్య బబిత అభినందించిన ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. సుకుమార్ ఇంట్లో పని చేసుకుంటునే కష్టపడి చదువుకుంది దివ్య. మరోవైపు దివ్య చదువుల ఖర్చును కూడా బబితనే భరించినట్లు సమాచారం.