Mandaadi | టాలీవుడ్ యాక్టర్ సుహాస్ వన్ ఆఫ్ ది లీడ్ రోల్లో నటిస్తోన్న తమిళ చిత్రం మండాడి (Mandaadi). సుహాస్ కోలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న ఈ మూవీలో తమిళ నటుడు సూరి మరో లీడ్ రోల్లో నటిస్తున్నాడు. సెల్ఫీ ఫేం మతిమారన్ పుగళేంది డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ సెప్టెంబర్ 10న తెలుగు, తమిళ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌లో భాగంగా ఏదో ఒక అప్డేట్ అందిస్తూ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచేస్తున్నారు.
ఇప్పటికే విడుదల చేసిన రషెస్ నెట్టింట హల్ చల్ చేస్తుండగా సుహాస్ బర్త్ డే స్పెషల్ ఒకటి ఆన్లైన్లో చక్కర్లు కొడుతూ సినిమాపై అంచనాలు పెంచేస్తుంది. మరోవైపు సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి క్లీన్ యూ/ఏ 16+ సర్టిఫికెట్ జారీ చేసినట్టు తెలియజేస్తూ సూరి బోటు రైడ్ చేస్తూ అగ్రెసివ్‌గా ఉన్న లుక్‌ను షేర్ చేశారు. ఈ లుక్ మండాడిపై హైప్ పెంచేస్తోంది.
తెలుగు రాష్ట్రాల్లో మండాడి థ్రియాట్రికల్ రైట్స్‌ను పాపులర్ టాలీవుడ్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ దక్కించుకుంది. దీంతో మండాడి సినిమాపై అంచనాలు మరింత పెరిగిపోతున్నాయి. తీర ప్రాంతం, మత్య్సకారుల నేపథ్యంలో స్పోర్ట్స్ డ్రామాగా వస్తోన్న ఈ మూవీలో సుహాస్ సాట్టపులి రోల్లో కనిపించబోతున్నాడు. మహిమా నంబియార్ కీలక పాత్రలో నటిస్తుండగా.. సత్యరాజ్, రవీంద్ర విజయ్, అచ్యుత్ కుమార్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీకి జీవీ ప్రకాశ్ కుమార్ మ్యూజిక్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తుండగా.. ఆర్ఎస్ ఇన్ఫోటైన్మెంట్ తెరకెక్కిస్తోంది.
Team #Mandaadi wishes their sensational and intense actor #Suhas a very happy birthday 🎉❤️🔥
Get Ready to witness his fiercest avatar as #SaattaPuli on Big Screens Soon 💥
MANDAADI IN WORLDWIDE THEATERS FROM SEPTEMBER 10TH ⛵⚓@sooriofficial @elredkumar pic.twitter.com/aoWtHDcVSJ
— Mohan Kumar (@ursmohan_kumar) August 19, 2026
#Mandaadi is U/A 16+ Certified! 🎬⚓#Mandaadi in cinemas worldwide on September 10, 2026. 🎬🔥@sooriofficial #Suhas #sathyaraj @Mahima_Nambiar @RavindraVijay1 @MithunJS5 @bala_actor @Kritika_Bala @elredkumar @rsinfotainment @MathiMaaran @gvprakash @PeterHeinOffl @dhilipaction… pic.twitter.com/njQxut5qLy
— Saravanaravikumar (@Saravanaspb) August 20, 2026