Mandaadi | తెలుగులో మంచి ఫ్యాన్ బేస్ సంపాదించుకున్న టాలెంటెడ్ యాక్టర్లలో ఒకడు సుహాస్. ఇక తమిళంతోపాటు తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు సూరి. ఈ ఇద్దరి కాంబోలో వస్తున్న చిత్రం మండాడి (Mandaadi). ఈ సినిమాతో సుహాస్ కోలీవుడ్లోకి కూడా ఎంట్రీ ఇస్తున్నాడని తెలిసిందే. సెల్ఫీ ఫేం మతిమారన్ పుగళేంది డైరెక్ట్ చేస్తున్నాడు.
తీర ప్రాంతం, మత్య్సకారుల నేపథ్యంలో స్పోర్ట్స్ డ్రామాతో సినిమా ఉండబోతుందని ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు మేకర్స్. మూవీ రియలిస్టిక్‌గా ఉండాలనే ఉద్దేశంతో రియల్ లొకేషన్స్‌లో షూట్ చేయడం విశేషం. ఈ మూవీ నుంచి ఇప్పటికే లాంచ్ చేసిన పోస్టర్లు నెట్టింట, మూవీ లవర్స్‌లో హైప్ క్రియేట్ చేస్తున్నాయి. తెలుగు, తమిళం భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానున్న ఈ మూవీ రిలీజ్ టైం రానే వచ్చింది. మండాడి సెప్టెంబర్ 4న గ్రాండ్‌గా విడుదల చేస్తున్నట్టు తెలియజేస్తూ కొత్త పోస్టర్ విడుదల చేశారు. సుహాస్, సూరి ఫేస్ టు ఫేస్ గా ఉన్న లుక్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.
కథను నమ్మి సినిమా చేసే సుహాస్ ఇక తమిళంలో కూడా తన లక్‌ను పరీక్షించుకోవాలనుకుంటున్నాడు. ఈ చిత్రంలో మహిమా నంబియార్ కీలక పాత్రలో నటిస్తుండగా.. సత్యరాజ్, రవీంద్ర విజయ్, అచ్యుత్ కుమార్ ఇతర కీ రోల్స్ పోషిస్తున్నారు. మనుగడ, వ్యక్తిగత గుర్తింపు, మానవ స్ఫూర్తి లాంటి థీమ్స్ నేపథ్యంలో సాగే ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్ కుమార్ మ్యూజిక్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని ఆర్ఎస్ ఇన్పొటైన్మెంట్ తెరకెక్కిస్తోంది.
సుహాస్, సూరి టీంపై వచ్చే హై ఇంటెన్సిటీతో సముద్రంలో సాగే యాక్షన్ పార్ట్‌తోపాటు సెయిల్ బోట్ రేస్ సినిమాకే హైలెట్‌గా ఉండబోతుందంటూ మేకర్స్ ఇప్పటికే క్లారిటీ కూడా ఇచ్చేశారు. ఈ మూవీకి పాపులర్ యాక్షన్ కొరియోగ్రఫర్ పీటర్ హెయిన్స్ పనిచేస్తుండటంతో అంచనాలు అమాంతం పెరిగిపోతున్నాయి.
A story born from the sea is ready to conquer the world ⛵🔥#Mandaadi arrives in cinemas worldwide on September 4, 2026 !#Mandaadifromsept4#Suhas @elredkumar #vetrimaaran @rsinfotainment @MathiMaaran @gvprakash @Mahima_Nambiar@RavindraVijay1 @MithunJS5#sathyaraj… pic.twitter.com/Le7wK198Fl
— Actor Soori (@sooriofficial) June 11, 2026
Bharathiraja | ఇండియన్ సినిమా గమనాన్ని మార్చిన దిగ్గజం.. భారతీరాజా మృతి పట్ల ప్రధాని మోదీ సంతాపం
Sachin Pilot | మళ్లీ తెరపైకి రాజస్థాన్ కాంగ్రెస్ విభేదాలు.. గెహ్లాట్ వ్యాఖ్యలకు పైలట్ కౌంటర్
Peddi Collections | మొదటి వారంలోనే రూ.345 కోట్లు.. రూ. 400 కోట్ల దిశగా రామ్ చరణ్ ‘పెద్ది’