సుహాస్ కథానాయకుడిగా రూపొందిన రొమాంటిక్ కామెడీ ఎంటైర్టెనర్ ‘ఓ భామా అయ్యో రామ’. ‘జో’ఫేం మాళవిక మనోజ్ కథానాయిక. రామ్ గోధల దర్శకుడు. హరీష్ నల్ల నిర్మాత. ఈ నెల 11న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా సినిమా ట్రైలర్‌ని శనివారం మేకర్స్ విడుదల చేశారు. యువతరం ప్రేక్షకులను అలరించేలా ఫుల్ ప్యాకేజీతో ఈ సినిమా నిర్మించారని టైటిల్ చెబుతున్నది.
ఇదో క్యూట్ రొమాంటిక్ ఎంటైర్టెనర్ అని, ఇందులోని ప్రతి సన్నివేశం ఆడియన్స్‌ను అలరిస్తుందని, హీరోహీరోయిన్ల లవ్‌సీన్స్ యూత్‌ని ఆకట్టుకుంటాయని నిర్మాత తెలిపారు. యువతరం హృదయాలను దోచుకునేలా ఈ రొమాంటిక్ ఎంటైర్టెనర్ ఉంటుందని, సాంకేతికంగా కూడా అభినందనీయంగా సినిమా ఉంటుందని, ఏ విషయంలోనూ నిర్మాత రాజీపడలేదని దర్శకుడు తెలిపారు. దర్శకుడు హరీష్‌శంకర్ అతిథి పాత్రలో నటించిన ఈ చిత్రానికి కెమెరా: మణికందన్, సంగీతం: రథన్.