సుహాస్ హీరోగా నటిస్తున్న రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ‘ఓ భామ అయ్యో రామ’. రామ్ గోధల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని హరీష్ నల్ల నిర్మిస్తున్నారు. మాళవిక మనోజ్ కథానాయిక. జూలై 11న విడుదలకానుంది. శుక్రవారం ఈ సినిమా నుంచి ‘గల్లీ స్టెప్..’ అనే లిరికల్ వీడియోను విడుదల చేశారు. ‘ఓ మెరుపులా చిందులే వేయరా..’ అంటూ సాగే ఈ పాటను సుహాస్ స్వయంగా ఆలపించడం విశేషం. రథన్ స్వరపరచిన ఈ పాటకు కాసర్ల శ్యామ్ సాహిత్యాన్నందించారు.
‘నేటి ట్రెండ్‌కు అనుగుణంగా సాగే మాస్ గీతమిది. గల్లీల్లో పాడే తీన్మార్ పాటలా ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉంది. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. రెండున్నర గంటల పాటు ప్రేక్షకుల్ని నవ్విస్తుంది’ అని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రంలో ప్రముఖ దర్శకుడు హరీష్‌శంకర్ అతిథి పాత్రలో కనిపించబోతున్నారు. ఈ చిత్రానికి కెమెరా: మణికందన్, సంగీతం: రథన్, దర్శకత్వం: రామ్ గోధల.