సుహాస్, షాలిని కొండేపూడి జంటగా నటిస్తున్న నూతన చిత్రం ‘కేబుల్ రెడ్డి’ శుక్రవారం ప్రారంభమైంది. శ్రీధర్ రెడ్డి దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రాన్ని ఫ్యాన్ మేడ్ ఫిల్మ్స్ పతాకంపై బాలు వల్లు, ఫణి ఆచార్య నిర్మిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు శైలేష్ కొలను క్లాప్‌నిచ్చారు. దర్శకుడు చిత్ర విశేషాలు తెలియజేస్తూ ‘ఓ పట్ణణంలో జరిగే కథ ఇది.
ఆసక్తికరమైన స్క్రీన్‌ప్లేతో సాగుతుంది. ఆద్యంతం హాస్యరస భరితంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది’ అన్నారు. రెండు రోజుల్లో రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుందని, చక్కటి వినోదాత్మక కథ ఇదని సుహాస్ తెలిపారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: మహిరెడ్డి పండుగల, సంగీతం: స్మరణ్ సాయి, ఆర్ట్: క్రాంతి ప్రియం, దర్శకత్వం: శ్రీధర్ రెడ్డి.