‘ఓ మిడిల్‌క్లాస్ అబ్బాయి.. తనకొచ్చే జీతంలో హ్యాపీగా ఉంటాడు. పెళ్లి చేసుకుంటాడు. పిల్లలు వద్దంటాడు. ఎందుకంటే.. పిల్లలు పుడితే ఎదురయ్యే ఖర్చులు చెప్పి అడిగినవాళ్ల నోళ్లు మూయిస్తాడు. ఈ కేరక్టరైజేషనే నన్ను కట్టిపడేసింది. ఈ రోజుల్లో డబ్బు అవసరమే. అలాగే ఎమోషన్స్ కూడా అవసరం. డైరెక్టర్ సందీప్ తన రియల్‌లైఫ్‌లో చూసిన ఇన్సిడెన్స్ని బేస్ చేసుకుని ఈ కథ రాసుకున్నాడు. దీన్ని హ్యూమరస్‌గా, మంచి కాన్సెప్ట్‌తో తయారు చేశాడు. సినిమా చూశాను. చాలా రోజుల తర్వాత మంచి సినిమా చూసిన అనుభూతి కలిగింది. సెప్టెంబర్ 7న విడుదల చేస్తున్నాం. కమిటీకుర్రోళ్లు, ఆయ్ సినిమాల విషయంలో ప్రేక్షకులు ఎలాగైతే ఫ్రెష్‌గా ఫీలవుతున్నారో ఈ సినిమాను కూడా అలాగే ఫీలవుతారు. మిడిల్‌క్లాస్ అబ్బాయిగా సుహాస్ చక్కగా నటించాడు.’ అని దిల్ రాజు అన్నారు. దిల్‌రాజు ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందిన తాజా చిత్రం ‘జనక అయితే గనక’. సుహాస్, సంగీర్తన జంటగా నటించారు. సుధీర్‌రెడ్డి బండ్ల దర్శకుడు. సెప్టెంబర్ 7న సినిమా విడుదల కానుంది. సోమవారం హీరో సుహాస్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాలోని ‘నా ఫేవరేట్ పెళ్లాం’ సాంగ్‌ని హైదరాబాద్‌లో లాంచ్ చేశారు. ఈ కార్యక్రమంలో దిల్‌రాజు మాట్లాడారు. దర్శకుడు సందీప్ మరిచిపోలేని సినిమా ఇచ్చాడని, దిల్ రాజుగారికి పెద్ద థ్యాంక్సని సుహాస్ అన్నారు. ఇంకా చిత్ర యూనిట్ మొత్తం మాట్లాడారు.