‘నటునిగా నాలోని మరోకోణాన్ని చూపించే పాత్ర ఇది. ఇదో కొత్త ప్రయత్నం. మీకు నచ్చితే పదిమందికి చెప్పండి. గురువారం అందరూ ఓటు వేయండి. 1న అందరూ నా సినిమా చూడండి.’ అని సుడిగాలి సుధీర్ అన్నారు. ఆయన కథానాయకుడిగా రూపొందిన చిత్రం ‘కాలింగ్ సహస్ర’. డాలీషా కథానాయిక. అరుణ్ విక్కిరాలా దర్శకుడు. విజేష్ తయాల్, చిరంజీవి పమిడి, వెంకటేశ్వర్లు కాటూరి నిర్మాతలు. డిసెంబర్ 1న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్లో నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకలో సుధీర్ మాట్లాడారు. అతిథులుగా విచ్చేసిన జేడీ చక్రవర్తి, దర్శకులు దశరథ్, బొమ్మరిల్లు భాస్కర్ సినిమా మంచి విజయం సాధించాలని శుభాకాంక్షలు అందించారు. ‘సమయం వచ్చే వరకూ ప్రతి ఒక్కరూ సామాన్యులే అనే లైన్ ఆధారంగా చేసుకుని ఈ కథ రాసుకున్నాను. సాంకేతికంగా అద్భుతంగా ఉంటుందీ సినిమా. నిర్మాతలు పేషన్తో ఈ సినిమాను నిర్మించారు. ఇందులో కొత్త సుధీర్ని చూస్తారు.’ అని దర్శకుడు అరుణ్ విక్కిరాలా అన్నారు. ఇంకా చిత్ర యూనిట్ సభ్యులందరూ మాట్లాడారు.