సుడిగాలి సుధీర్, దివ్యభారతి జంటగా నటిస్తున్న తాజా చిత్రానికి ‘జీ.ఓ.ఏ.టీ’ (గోట్) అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ‘గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్స్’ ఉపశీర్షిక. నరేష్ కుప్పిలి దర్శకుడు. శుక్రవారం హీరో సుడిగాలి సుధీర్ జన్మదినం సందర్భంగా టైటిల్‌ను ప్రకటించడంతో పాటు ఫస్ట్‌లుక్ విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు చిత్ర విశేషాలు తెలియజేస్తూ ‘ వినూత్నమైన కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. సుడిగాలి సుధీర్ పాత్ర కొత్త పంథాలో ఉంటుంది.
ఆద్యంతం చక్కటి వినోదంతో ఆకట్టుకునే చిత్రమిది’ అన్నారు. ‘ప్రస్తుతం చిత్రీకరణ జరుపుతున్నాం. సరికొత్త కాన్సెప్ట్‌తో ఈ సినిమా ప్రతి ఒక్కరిని మెప్పిస్తుంది’ అని నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: బాలాజీ సుబ్రహ్మణ్యం, సంగీతం: లియొన్ జేమ్స్, ఆర్ట్: రాజీవ్ నాయర్, నిర్మాతలు: చంద్రశేఖర్ రెడ్డి బెక్కెం వేణుగోపాల్, నిర్మాణ సంస్థ: లక్కీ మీడియా, మహారాజా క్రియేషన్స్, దర్శకత్వం: నరేష్ కుప్పిలి.