సుడిగాలి సుధీర్, డాలీషా జంటగా రూపొందుతున్న చిత్రం ‘కాలింగ్ సహస్త్ర’. అరుణ్ విక్కిరాలా దర్శకుడు. విజేష్ తయాల్, చిరంజీవి పమిడి, వెంకటేశ్వర్లు కాలూరి నిర్మాతలు. ఈ చిత్రం నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. సుధీర్ పాత్ర కొత్తగా ఉంటుందని, వైల్డ్‌గా, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో మాస్ ప్రేక్షకులకు నచ్చేలా అతని పాత్ర సాగుతుందని, ఊహించని మలుపులతో సాగే కథ ఇదని నవంబర్‌లో సినిమాను విడుదల చేస్తామని నిర్మాతలు చెప్పారు. శివబాలాజీ, మనోహరన్, రవితేజ సన్నిమాల తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: సన్నిడి.