సుడిగాలి సుధీర్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘G.O.A.T’. ‘గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్టైమ్స్’ అనేది ఉపశీర్షిక. దివ్యభారతి కథానాయిక. చంద్రశేఖర్ మొగుళ్ల నిర్మాత. ప్రస్తుతం ఈ సినిమా నిర్మాణ దశలో ఉంది. ప్రమోషన్లో భాగంగా ఆదివారం హీరో ఇంట్రడక్షన్ సాంగ్‌ని మేకర్స్ విడుదల చేశారు. ‘నీలావుండే లక్కు మాకే లేదురా.. సెలబ్రిటీ నీకన్నా ఎవడురా..’ అంటూ సాగే పాటను కాసర్ల శ్యామ్ రాయగా, లియోన్ జేమ్స్ స్వరపరిచారు. దీపక్ బ్లూ ఈ పాటను ఆలపించారు. హీరో కేరక్టరైజేషన్‌కి అద్దం పట్టేలా ఈ పాట సాహిత్యం, చిత్రీకరణ సాగిందని మేకర్స్ తెలిపారు. టాకీపార్ట్ దాదాపు పూర్తయిందని, యాక్షన్ ఎపిసోడ్స్, రెండు పాటలు బ్యాలెన్స్ ఉన్నాయని, త్వరలోనే వాటిని పూర్తి చేస్తామని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: రసూల్ ఎల్లోర్, నిర్మాణం: మహాతేజ క్రియేషన్స్, జైష్ణవ్ ప్రొడక్షన్స్.