G.O.A.T | సుడిగాలి సుధీర్ (Sudigaali Sudheer), దివ్య భారతి (Divyabharathi) హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం G.O.A.T : Greatest Of All Times (ట్యాగ్‌లైన్). పాగల్ ఫేమ్ డైరెక్టర్ నరేష్ కుప్పిలి దర్శకత్వం వహిస్తున్నాడు. ఎస్ఎస్4 (SS4)గా వస్తున్న ఈ మూవీని లక్కీ మీడియా, మహాతేజ క్రియేషన్స్ బ్యానర్స్ పై చంద్ర శేఖర్ రెడ్డి మొగుళ్ళ, బెక్కం వేణుగోపాల్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
రీసెంట్గా సీఎంఆర్ ఇంజినీరింగ్ కాలేజ్‌లో జరిగిన ఈవెంట్లో ఈ మూవీ నుంచి రైజ్ ఆఫ్ గుణ లిరికల్ వీడియో సాంగ్‌ను మేకర్స్ లాంచ్ చేశారు. కాసర్ల శ్యామ్ రాసిన ఈ పాటకు లియోన్స్ జేమ్స్ సంగీతం అందించాడు. హీరో క్యారెక్టరైజేషన్‌ను చూపించేలా పవర్ఫుల్ మాస్ రేంజ్లో పాట ఉండబోతుందని విజువల్స్ చెబుతున్నాయి. ఖర్చు విషయంలో ఏ మాత్రం రాజీపడకుండా చాలా రిచ్‌గా సినిమాను తెరకెక్కిస్తున్నామని.. సుడిగాలి సుధీర్ కెరీర్లో ఈ మూవీ మైల్ స్టోన్‌గా నిలుస్తుందని నిర్మాత చంద్రశేఖర్ రెడ్డి చెప్పారు.
ఈ మూవీలో సర్వధమన్ బెనర్జీ, నితిన్ ప్రసన్న, బ్రహ్యాజీ, పృథ్వీ, ఆడుకాలం నరేష్, రాజేంద్రన్, ఆనంద్ రామరాజ్, చమ్మక్ చంద్ర, పమ్మీ సాయి, నవీన్ నేని ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీకి లియోన్ జేమ్స్ సంగీతం అందిస్తుండగా.. మణిశర్మ నేపథ్య సంగీతం అందిస్తున్నారు.
ఈ చిత్రానికి సమైరా రెడ్డి.ఎన్ కో ప్రొడ్యూసర్‌గా, ప్రసూన మండవ క్రియేటివ్ ప్రొడ్యూసర్లుగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం నిర్మానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రం ఫిబ్రవరిలో విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్‌కు మంచి స్పందన వస్తోంది.

When the moment Arrives..
History has no Choice.
Just Follows🔥#RiseOfGana Lyrical Video Out Now🔗https://t.co/1iSKZtuxCH#GOATTheMovie@sudheeranand @divyabarti2801 @VedavyasAkula @leon_james #Manisharma @MahatejaC @IamEluruSreenu @madurimadhu1 @RainbowMedia_ @saregamasouth pic.twitter.com/XQS9BjL0vI
— Mahaateja Creations (@MahatejaC) January 26, 2026