Jatadhara | టాలీవుడ్ యాక్టర్ సుధీర్ బాబు (Sudheer babu) నటిస్తోన్న సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ జటాధర (Jatadhara). వెంకట్ కల్యాణ్ (Venkat Kalyan) కథనందిస్తూ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ నవంబర్ 7న తెలుగు, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు. ప్రమోషన్స్‌లో భాగంగా విడుదల చేసిన సోనాక్షి సిన్హా ధన పిశాచి లుక్ నెట్టింట వైరల్ అవుతోంది.
కాగా ధన పిశాచి టీం ప్రమోషన్స్‌లో భాగంగా బిగ్ బాస్ సీజన్ 9లో సందడి చేసింది. ఈ సందర్భంగా సుధీర్ బాబు త్రిశూలాన్ని పట్టుకొని వచ్చి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాడు. జటాధర టీం సినిమా విశేషాలను షేర్ చేసుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. జటాధర టీం తెలుగు ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. పోస్టర్ చూస్తుంటే ఇందులో సోనాక్షి సిన్హా డబ్బు పిచ్చి ఉన్న వ్యక్తి పాత్రలో కనిపించబోతున్నట్టు హింట్ ఇచ్చేశారు మేకర్స్ .
ఇటీవలే ఈ మూవీ నుంచి సోల్ ఆఫ్ జటాధర ట్రాక్ ప్రోమోను విడుదల చేయగా.. ఓం నమ : శివాయ్ అంటూ సాగుతున్న ప్రోమో గూస్బంప్స్ తెప్పిస్తోంది. ఇప్పటికే లాంచ్ చేసిన పోస్టర్లలో ఓ వైపు శివుడు మరోవైపు చేతిలో త్రిశూలాన్ని పట్టుకున్న సుధీర్‌బాబు, ఇంకోవైపు ఉగ్రరూపంలో కనిపిస్తున్న సోనాక్షి సిన్హా లుక్స్ సినిమాపై అంచనాలు అమాంతం పెంచేస్తున్నాయి. ఈ మూవీలో బాలీవుడ్ భామ సోనాక్షి సిన్హా ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తుండగా.. శిల్పా శిరోద్కర్ కీలక పాత్రలో నటిస్తోంది.
Catch the Team of #Jatadhara 🔱 – @isudheerbabu, @sonakshisinha & @shilpashirodkr bringing their energy to #BiggBossTelugu9 today from 7PM ❤️🔥
ICYM #JatadharaTrailer 🔥
▶️ https://t.co/Dsr8RMS8VDWitness #Jatadhara🔱 in theatres from Nov 7th 2025 in Telugu & Hindi 🪔… pic.twitter.com/69zyuproVb
— BA Raju’s Team (@baraju_SuperHit) October 19, 2025