Mama Mascheendra Movie Teaser | కెరీర్ బిగెనింగ్ నుంచి కథా బలమున్న సినిమాలు చేస్తున్న కమర్షియల్ హీరో స్టేటస్ మాత్రం దక్కించుకోలేకపోతున్నాడు సుధీర్ బాబు. కెరీర్ బిగెనింగ్ నుండి వినూత్న సినిమాలు చేస్తున్నా ఎందుకో సుధీర్‌కు రావాల్సిన గుర్తింపు రావడం లేదు. ‘సమ్మోహనం’ సినిమాతో మంచి క్రేజ్ తెచ్చుకున్న సుధీర్.. ఈ క్రేజ్‌ను కాపాడుకోవడానికి ప్రతీ సినిమాకు తన బెస్ట్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ టైమ్ బాలేకో, అదృష్టం లేకో సుధీర్ సినిమాలు వరుసగా ఫ్లాపుల బాట పడుతున్నాయి. ఈ ఏడాది రిలీజైన హంట్ సుధీర్ కెరీర్లో అతిపెద్ద డిజాస్టర్‌గా మిగిలింది. ప్రస్తుతం ఆయన ఆశలన్నీ మామా మశ్చీంద్రా సినిమాపైనే ఉన్నాయి.
తాజాగా మహేష్ బాబు ఈ సినిమా టీజర్‌ను రిలీజ్ చేశాడు. లేటెస్ట్గా రిలీజైన టీజర్ కాస్త ఆసక్తిని క్రియేట్ చేస్తుంది. మూడు విభిన్న గెటప్స్‌లో సుధీర్ అదరగొడుతున్నాడు. టీజర్‌ను గమనిస్తే కాస్త వైలెన్స్ కూడా ఎక్కువే ఉన్నట్లు స్పష్టం అవుతుంది. దేవుడు అడిగాడట నన్ను చేరడానికి ఏడు జన్మలు భక్తుల్లా బతుకుతారా? లేక మూడు జన్మలు రాక్షసుల్లా బతుకుతారా? అని. మీకు దూరంగా ఉండటం కన్నా మూడు జన్మలు రాక్షస జన్మే మిన్న అని దేవతలే కోరుకున్నారట. వేగం ఎక్కువైతే ఆగం అవుతావు కాకా, కిక్కు కోసం వెళ్తే కక్కొస్తుంది. ఈ జెనరేషన్ గుంటలందరికీ సిక్స్ ప్యాక్ పిచ్చిపట్టింది. ఫ్యామిలీ ప్యాక్ ఉన్నోడు ఫ్యామిలీని సుబ్బరంగా చూసుకుంటాడు అనే డైలాగ్స్ మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్నాయి.
అన్ని కలగలిసిన విందు భోజనంలా టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. చూస్తుంటే ఈ సారి సుధీర్ బాబు మంచి కంబ్యాక్ ఇచ్చేలానే కనిపిస్తున్నాడు. కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో సుధీర్ బాబుకు జోడీగా ఈషా రెబ్బా, మృనాళిని రవి నటిస్తున్నారు. శ్రీవెంకటేశ్వరా సినిమాస్ ఎల్ఎల్పీ బ్యానర్‌పై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. చైతన్య భరద్వాజ్ సంగీతం అందిస్తున్నాడు.