సుధీర్‌బాబు, సోనాక్షి సిన్హా, శిల్పా శిరోద్కర్ ప్రధాన పాత్రధారులుగా రూపొందుతోన్న సూపర్ నాచురల్ థ్రిల్లర్ ‘జాటాధర’. తెలుగు, హిందీ భాషల్లో రూపొందుతున్న ఈ పాన్ ఇండియా చిత్రానికి వెంకట్ కల్యాణ్ దర్శకుడు. ప్రేరణ అరోరా, శివన్ నారంగ్, అరుణ అగర్వాల్ నిర్మాతలు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్‌ప్రొడక్షన్ దశలో ఉంది.
మే 31న లెజెండ్రీ నటుడు సూపర్‌స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పిస్తూ ‘జటాధర’ యూనిట్ ఓ పోస్టర్ని విడుదల చేసింది. సుదీర్ఘమైన కృష్ణ నట ప్రస్థానాన్ని ఈ సందర్భంగా వాళ్లు గుర్తు చేసుకుంటూ, సూపర్‌స్టార్ మార్గంలోనే తాము కూడా పయనిస్తామని, ఆయనే తామందరికీ స్ఫూర్తి ప్రదాత అని ఓ ప్రకటన ద్వారా తెలియజేశారు. రవిప్రకాష్, ఇంద్రకృష్ణ, నవీన్ నేని, శుభలేఖ సుధాకర్, రాజీవ్ కనకాల, ఝాన్సీ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి అక్షయ్ క్రేజీవాల్, కుస్సుమ్ అరోరా సహ నిర్మాతలు.