సుధీర్‌బాబు నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘హరోం హర’. ది రివోల్ట్ అనేది ఉపశీర్షిక. జానసాగర్ ద్వారక దర్శకుడు. సుమంత్ జి.నాయుడు నిర్మిస్తున్నారు. సుధీర్‌బాబు బాబు జన్మదినం సందర్భంగా ఫస్ట్ ట్రిగ్గర్ వీడియోను విడుదల చేసింది చిత్రబృందం. దర్శకుడు మాట్లాడుతూ ‘ప్రచార చిత్రంలో వున్న ‘అందరు పవర్ కోసం గన్ పట్టుకుంటారు.
కానీ ఇది యాడాడో తిరిగి నన్ను పట్టుకుంది’ అనే సంభాషణ అందర్ని ఆకట్టుకుంటుంది. 1989లో చిత్తూరు జిల్లా కుప్పంలో జరిగే ఈ కథలో సుధీర్‌బాబు పాత్ర చాలా కొత్తగా వుంటుంది. ఈ ఏడాది డిసెంబర్ 22న నాలుగు భాషల్లో చిత్రాన్ని విడుదల చేస్తాం’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: చైతన్ భరద్వాజ్