సుధీర్‌బాబు, సోనాక్షి సిన్హా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సూపర్ నాచురల్ మైథలాజికల్ థ్రిల్లర్ ‘జటాధర’. ఈ పాన్ ఇండియా ద్విభాషా చిత్రానికి వెంకట్ కల్యాణ్, అభిషేక్ జైస్వాల్ దర్శకత్వం వహిస్తురు. పౌరాణిక ఇతివృత్తాలతో గ్రేట్ సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌ని ఈ సినిమా అందివ్వబోతున్నదని మేకర్స్ చెబుతున్నారు. నవంబర్ 7న ఈ సినిమా విడుదల కానుంది.
రీసెంట్గా విడుదల చేసిన ‘సోల్ ఆఫ్ జటాధర’కి మంచి స్పందన వచ్చిందని మేకర్స్ చెబుతున్నారు. విజయదశమి కానుకగా అక్టోబర్ 1న ఈ సినిమా నుంచి ‘ధన పిశాచి..’ సాంగ్‌ని విడుదల చేస్తున్నట్టు మేకర్స్ ప్రకటించారు. ఈ సందర్బంగా అనౌన్స్మెంట్ పోస్టర్ని కూడా విడుదల చేశారు.
మంచికీ చెడుకీ, వెలుగుకీ చీకటికీ, మానవ సంకల్పానికీ, విధికీ మధ్య జరిగే పోరాటాన్ని ఈ చిత్రం చూ పించబోతున్నదని మేకర్స్ తెలిపారు. దివ్య ఖోస్లా, శిల్పా శిరోద్కర్, ఇంద్రకృష్ణ, రవిప్రకాశ్, నవీన్ నేని, రోహిత్ పాఠక్, ఝాన్సీ, రాజీవ్ కనకాల, శుభలేఖ సుధాకర్ ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి ఉమేష్‌కుమార్ బన్సల్, శివిన్ నారంగ్, అరుణ అగర్వాల్, ప్రేరణ అరోరా, శిల్పా సింగ్హాల్, నిఖిల్ నందా నిర్మాతలు.