సుధీర్‌బాబు, సోనాక్షిసిన్హా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న మైథలాజికల్ సూపర్‌నేచురల్ థ్రిల్లర్ ‘జటాధర’. వెంకట కల్యాణ్, అభిషేక్ జైస్వాల్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని నవంబర్ 7న విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ తెలిపారు. ఈ సందర్భంగా కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో హీరో సుధీర్‌బాబు డివైన్ ఫీల్ ఉన్న లుక్‌తో కనిపిస్తున్నారు. భారతీయ పురాణాలు, జానపద కథల స్ఫూర్తితో ఈ చిత్రాన్ని తెరకెక్కించామని, గ్రాఫిక్స్ అబ్బురపరుస్తాయని మేకర్స్ తెలిపారు.
మానవాళికి, దైవానికి మధ్య జరిగే సంఘర్షణ ప్రధానాంశంగా ఈ చిత్రాన్ని రూపొందించామని , విజువల్స్ పరంగా ప్రేక్షకుల్ని కొత్త లోకంలోకి తీసుకెళ్తుందని చిత్రబృందం తెలిపింది. జీ స్టూడియోస్, ఎస్కే ఎంటర్టైన్మెంట్ పతాకాలపై ఉమేష్‌కుమార్ బన్స్, శివిన్ నారంగ్, అరుణ అగర్వాల్, ప్రెర్నా అరోరా, శిల్పా సింగాల్, నిఖిల్ నందా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.