Harom hara | టాలీవుడ్ హీరో సుధీర్‌బాబు (Sudheer Babu) ఇటీవలే హరోం హర (Harom Hara: The Revolt) సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడని తెలిసిందే. సెహరి ఫేం జ్ఞానసాగర్ ద్వారకా కథనందిస్తూ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం మే 31న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైంది. ఈ చిత్రంలో మాళవిక శర్మ హీరోయిన్గా నటించింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీ ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఇంప్రెస్ చేయలేకపోయింది.
కాగా ఇటీవలే పాపులర్ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ఆహా, ఈటీవీ విన్లో ప్రీమియర్ అయిన విషయం తెలిసిందే. కాగా ఇప్పుడు మరో భాషలో కూడా హరోంహర సందడి చేయనుంది. హరోంహర హిందీ వెర్షన్ ఇవాళ్టి నుంచి స్ట్రీమింగ్ కానుండగా.. జియో సినిమాలో ఈ వెర్షన్‌ను వీక్షించే అవకాశం కల్పించారు మేకర్స్. 1989 బ్యాక్ డ్రాప్లో చిత్తూరులోని కుప్పం నేపథ్యంలో సాగే స్టోరీతో పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీలో సునీల్, జయ ప్రకాశ్, అక్షర, అర్జున్ గౌడ, లక్కి లక్ష్మణ్, రవి కాలే ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు.
ఈ చిత్రాన్ని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుమంత్ నాయుడు తెరకెక్కించారు. ఈ మూవీకి చేతన్ భరద్వాజ్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించాడు. సుధీర్ బాబు ప్రస్తుతం సూపర్ న్యాచురల్ థ్రిల్లర్‌గా రాబోతున్న పాన్ ఇండియా చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి వెంకట్ కల్యాణ్ (డెబ్యూ) దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రాన్ని రుస్తుం, టాయ్‌లెట్ ఏక్ ప్రేమ్ కథ, ప్యాడ్, పారి లాంటి నేషనల్ అవార్డు విన్నింగ్ సినిమాలను నిర్మించిన ప్రేరణ అరోరా, శివ్, నిఖిల్, ఉజ్వల్ ఆనంద్‌తో కలిసి తెరకెక్కిస్తున్నారు. అద్భుతమైన స్టోరీలైన్‌తో కొత్త స్టాండర్డ్ విజువల్ ఎఫెక్ట్స్‌తో సినిమా ఉండబోతున్నట్టు సమాచారం.
#HaromHara OTT RELEASE NOW HINDI LANGUAGE ONLY ON @JioCinema pic.twitter.com/62I8yQvRIS
— OTTGURU2 (@ottguru2) July 18, 2024
Dhanush | నిప్పులాంటి నిరుద్యోగి.. ధనుష్ ల్యాండ్ మార్క్ సినిమా వీఐపీకి పదేళ్లు..
Shiva Balaji | 200 యూట్యూబ్ ఛానళ్లపై ఫిర్యాదు చేశాం: నటుడు శివబాలాజీ
Shivam Bhaje | అశ్విన్ బాబు శివం భజే నుంచి రామ్ రామ్ ఈశ్వరం సాంగ్
Malavika Mohanan | అందానికే అసూయ పుట్టేలా.. ట్రెండింగ్‌లో మాళవిక మోహనన్ స్టిల్స్