Harom Hara | టాలీవుడ్ హీరో సుధీర్‌బాబు (Sudheer Babu) నటిస్తున్న తాజా చిత్రం ‘హరోంహర’(Harom Hara). ‘ది రివోల్ట్’ అనేది ఉపశీర్షిక. ఈ సినిమాకు జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వం వహిస్తుండగా.. సుమంత్ జి.నాయుడు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈసినిమా నుంచి ఫస్ట్ లుక్‌తో పాటు విలన్ పాత్రలు పోషిస్తున్న వారి ఫస్ట్ లుక్‌లను విడుదల చేయగా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సినిమా టీజర్‌ను పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ యూట్యూబ్ వేదికగా విడుదల చేశారు.
అందరూ పవర్ కోసం గన్ పట్టుకుంటారు. కానీ ఇది ఎక్కడెక్కడో తిరిగి నన్ను పట్టుకుంది అంటూ టీజర్ మొదలైంది. టీజర్ గమనిస్తే.. ఒక సామాన్య యువకుడిలా ఉండే సుధీర్ బాబు సడన్‌గా గన్ పట్టుకోవాల్సిన అవసరం వస్తుంది. అయితే అతడికి గన్ పట్టుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది. అతనికి జరిగిన అన్యాయం ఏంటి. అనేది ఈ సినిమా స్టోరీ అని అర్థమవుతుంది. ఇక 1989 నాటి చిత్తూరు జిల్లా కుప్పం నేపథ్యంలో జరిగిన కథాంశంతో వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ చిత్రం రానుండగా.. మూవీతో సుధీర్ బాబు మాస్ సంభవం చూపించబోతున్నట్లు తెలుస్తుంది. ఈ మూవీలో మాళవిక, సునీల్ రవి కాలే, కేజీఎఫ్ ఫేమ్ లక్కీ లక్ష్మణ్, అర్జున్ గోవిందా కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
ఇక తెలుగు టీజర్‌ని ప్రభాస్ చేతులు మీదుగా రిలీజ్ చేసిన చిత్రబృందం. కన్నడ టీజర్‌ను కిచ్చా సుదీప్తో, తమిళం టీజర్‌ను విజయ్ సేతుపతి, మలయాళంలో మమ్ముట్టి, హిందీలో టైగర్ ష్రాఫ్ చేత విడుదల చేయించారు.
ఇక ఈ ఏడాది మొదట్లో ‘హంట్’ అనే సినిమాతో థియేటర్లలో సందడి చేశాడు సుధీర్‌బాబు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా మిగలింది. అయితే ఈ మూవీ తర్వాత ‘మామా మశ్చింద్ర’ అనే డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కానీ ఈ చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. ఇక ఈ సినిమా కోసం మూడు డిఫరెంట్ రోల్స్‌లో వైవిధ్యభరితంగా కనిపించడానికి సుధీర్ కష్టపడినా.. సినిమా బోరింగ్‌గా ఉందంటూ నెగిటివ్ రివ్యూలు వచ్చాయి. ఇక ప్రస్తుతం సుధీర్‌బాబు ఆశలన్నీ ‘హరోంహర’ చిత్రంపైనే.