Harom Hara | సుధీర్‌బాబు (Sudheer Babu) ప్రధాన పాత్రలో వస్తున్న తాజా చిత్రం ‘హరోంహర’(Harom Hara). ‘ది రివోల్ట్’ అనేది ఉపశీర్షిక. యాక్షన్ ఎంటర్టైనర్గా వస్తున్న ఈ సినిమాకు జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వం వహిస్తుండగా.. మాళవికా శర్మ కథానాయికగా నటిస్తుంది. సుమంత్ జి.నాయుడు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా జూన్ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక రీసెంట్గా సెన్సార్ పనులు కూడా పూర్తి చేసుకున్న ఈ చిత్రం తాజాగా రిలీజ్ టీజర్ ను వదిలింది. యాక్షన్ ప్యాక్డ్గా సాగిన ఈ ట్రైలర్ ప్రస్తుతం నెట్టింటా ఆకట్టుకుంటుంది.
1989 నాటి చిత్తూరు జిల్లా కుప్పం నేపథ్యంలో జరిగిన కథాంశంతో వాస్తవ సంఘటనల ఆధారంగా రానుంది.. ఈ మూవీలో మాళవిక, సునీల్ రవి కాలే, కేజీఎఫ్ ఫేమ్ లక్కీ లక్ష్మణ్, అర్జున్ గోవిందా కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇక ఈ సినిమాలో సుధీర్‌బాబు కుప్పం యాసలో అలరించనున్నట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో రూపొందుతోన్న ఈ చిత్రానికి కెమెరా: అరవింద్ విశ్వనాథన్. సంగీతం చైతన్ భరద్వాజ్.