Harom hara | టాలీవుడ్ యువ హీరో సుధీర్‌బాబు (Sudheer Babu) పాన్ ఇండియా బ్యాక్ డ్రాప్లో నటిస్తోన్న చిత్రం హరోం హర (Harom Hara: The Revolt). Sudheer18గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సెహరి ఫేం జ్ఞానసాగర్ ద్వారకా డైరెక్ట్ చేస్తున్నాడు. ముందుగా ప్రకటించిన ప్రకారం హరోం హర ఫస్ట్ ట్రిగ్గర్ (టీజర్) ను (Harom Hara First Trigger) లాంఛ్ చేశారు మేకర్స్.
రాష్ట్రంలో రుతు పవనాల కారణంగా పలమనేరు, కుప్పం ప్రాంతాల్లో వర్షపాతం నమోదయ్యే అవకాశం కనిపిస్తోంది.. అని రేడియోలో వాతావరణ సూచనలతో వీడియో షురూ కాగా.. కొంతమంది రౌడీలు మారణాయుధాలతో కారులో నుంచి దిగి వస్తుండగా.. డార్క్ షేడ్స్‌లో ఉన్న హీరో వారిని ప్రతిఘటించేందుకు రెడీగా ఉన్నట్టు కనిపింస్తున్నాడు. ఉత్కంఠ రేకెత్తించేలా సాగుతున్న గ్లింప్స్ వీడియో స్టన్నింగ్‌గా కనిపిస్తూ.. సినిమా యాక్షన్ ఎలిమెంట్స్ తో గూస్ బంప్స్ తెప్పించేలా ఉండబోతున్నట్టు క్లారిటీ ఇచ్చేస్తుంది.
1989 నేపథ్యంలో చిత్తూరులోని కుప్పం బ్యాక్ డ్రాప్లో సాగే కథతో పాన్ ఇండియా పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా వస్తోంది. ఇప్పటికే లాంఛ్ చేసిన ఈ మూవీ కాన్సెప్ట్ టైటిల్ వీడియో నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఈ చిత్రాన్ని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుమంత్ నాయుడు తెరకెక్కిస్తుండగా.. చేతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నాడు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కానుంది.
సుధీర్ బాబు మరోవైపు కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న మామా మశ్చీంద్రాలో కూడా నటిస్తోన్న విషయం తెలిసిందే. త్వరలో విడుదలకు ముస్తాబవుతోంది. ఇందులో సుధీర్ బాబుకు జోడీగా ఈషా రెబ్బా, మృణాళిని రవి నటిస్తున్నారు. శ్రీవెంకటేశ్వరా సినిమాస్ ఎల్ఎల్పీ బ్యానర్‌పై సునీల్ నారంగ్, పీ రామ్ మోహన్ రావు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి హర్షవర్దన్ దర్శకత్వం వహిస్తున్నాడు.
హరోం హర ఫస్ట్ ట్రిగ్గర్..
హరోం హర కాన్సెప్ట్ టైటిల్ వీడియో..
హెచ్చరిక వర్షపాతనికే ఇచ్చిరి ఇంగ రక్తపాతనికి నేను ఇవ్వాల్నా ఏమి?
Truly, a new version of mine in store for you😎
In theaters from Dec 22, 2023!!
▶️https://t.co/sdr5xdYAzu#HaromHara@gnanasagardwara @SumanthnaiduG @chaitanmusic #AravindViswanathan #RavitejaGirijala… pic.twitter.com/2lsX1fo1dd— Sudheer Babu (@isudheerbabu) May 10, 2023