చిరంజీవితో ఆ 45 నిమిషాలు మరిచిపోలేను.. సుధాకర్ ఎమోషన్

‘హీరో ఇమేజ్‌కు పరిమితం కాకుండా నటనకు ప్రాధాన్యమున్న మంచి పాత్రలు దొరికితే చేయడానికి సిద్ధంగా ఉన్నా’ అని అన్నారు సుధాకర్ కోమాకుల. ఆయన ప్రధాన పాత్రను పోషించిన చిత్రం ‘రాజా విక్రమార్క’. కార్తికేయ హీరోగా నటించిన ఈ చిత్రానికి శ్రీ సరిపల్లి దర్శకుడు. 88 రామారెడ్డి నిర్మించారు. రేపు ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానున్నది. బుధవారం హైదరాబాద్‌లో సుధాకర్ కోమాకుల పాత్రికేయులతో ముచ్చటిస్తూ ‘దర్శకుడు శ్రీ సరిపల్లితో పదేళ్లుగా పరిచయముంది. ఆ సాన్నిహిత్యంతోనే ఇందులో ఏసీపీ గోవింద్ అనే కీలక పాత్ర కోసం ఆయన నన్ను సంప్రదించారు. నటుడిగా నాకు మంచి పేరుతెచ్చిపెడుతుందనే నమ్మకంతో అంగీకరించా. పాత్రలకు ప్రాముఖ్యముందనిపిస్తే హీరో, విలన్ అనే భేదాలు లేకుండా నవతరం నటులు అన్ని రకాల క్యారెక్టర్స్ చేస్తున్నారు. ఆ కోణం నుంచి ఆలోచించే ఈసినిమా చేశా.
‘లైఫ్‌ఈజ్‌బ్యూటిఫుల్’ తర్వాత నేను చేసిన సినిమాలేవి సరిగా ఆడలేదు. మంచి కథలు, పేరున్న దర్శకులతో సినిమాలు చేయాల్సింది. అనివార్య కారణాల వల్ల అవి సెట్స్‌పైకి రాలేదు. కథలు కుదరక చేసిన సినిమాలు ఆడలేదు. ఈ అపజయాల్ని చూసి నిరాశపడకుండా మంచి టైమ్ కోసం ఎదురుచూస్తున్నా. ఈ సినిమా నాకు పూర్వ వైభవం తీసుకొస్తుందనే నమ్మకముంది. కొవిడ్ సమయంలో నా భార్య హారికతో కలిసి చేసిన ‘ఇందువదన’ కవర్సాంగ్కు మంచి స్పందన వచ్చింది. ఈ పాట చూసి చిరంజీవిగారు అభినందించారు. ఆయన్ని కలవాలనుందని అడగ్గానే అంగీకరించారు. నలభై ఐదు నిమిషాలు ఆయనతో మాట్లాడటం నా జీవితంలో మర్చిపోలేను. ప్రస్తుతం ‘నారాయణ అండ్ కో’, ‘జీడీ’(గుండెల్లోదమ్ము) అనే సినిమాలు చేస్తున్నా. సుఖ మీడియా పేరుతో నిర్మాణ సంస్థను ప్రారంభించా. ఈ సంస్థ ద్వారా ఇతరుల భాగస్వామ్యంతో కొత్త కథాంశాలతో కూడిన సినిమాల్ని నిర్మించాలనుంది. ఒక ఇండిపెండెంట్ సాంగ్ కూడా చేశా. త్వరలో అది విడుదలకానుంది’ అని తెలిపారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Pushpa Promotional Event | పుష్ప స్పెషల్ ప్రమోషనల్ ఈవెంట్ ఎక్కడో తెలుసా..?
NBK107 Launch Date | బాలకృష్ణ-గోపీచంద్ ఎంటర్టైనర్ లాంఛింగ్ టైం ఫిక్స్
mega154 | చిరంజీవి సినిమాలో మరో స్టార్ హీరో?
బాబోయ్ ఇది ఊర నాటు.. మాస్ డాన్సులతో కుమ్మేసిన చరణ్, ఎన్టీఆర్..
Brahmanandam Rejection | బ్రహ్మానందంను సినిమా నుంచి తొలగించిన నితిన్..?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

