Sudhakar Komakula | మ్యూజిక్ వీడియోతో Memories క్రియేట్ చేస్తానంటున్న సుధాకర్ కోమాకుల
Sudhakar Komakula | లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలో తెలంగాణ యాసలో సాగే క్యారెక్టర్‌తో అందరిని ఇంప్రెస్ చేశాడు సుధాకర్ కోమాకుల (Sudhakar Komakula). నువ్వు తోపురా సినిమాతో సింగర్‌గా కూడా మారిన ఈ టాలెంటెడ్ యాక్టర్ మ్యూజిక్ వీడియోతో అలరించేందుకు రెడీ అవుతున్నాడు.
Sudhakar Komakula | లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలో తెలంగాణ యాసలో సాగే క్యారెక్టర్‌తో అందరిని ఇంప్రెస్ చేశాడు యువ నటుడు సుధాకర్ కోమాకుల (Sudhakar Komakula). ఇటీవలే ఫన్ ఎంటర్టైనర్ నారాయణ అండ్ కో సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. నువ్వు తోపురా సినిమాతో సింగర్‌గా కూడా మారిన ఈ టాలెంటెడ్ యాక్టర్ మ్యూజిక్ వీడియోతో అలరించేందుకు రెడీ అవుతున్నాడు.
Memories టైటిల్‌తో రాబోతున్న ఈ మ్యూజిక్ వీడియోను హోంబ్యానర్ సుఖ మీడియాపై నిర్మిస్తుండటం విశేషం. ఈ మ్యూజిక్ వీడియోను శాన్ ఫ్రాన్సిస్కో నగరంలో రియల్ వరల్డ్ ఫుటేజ్, 2డి యానిమేషన్‌తో కలిపి షూట్ చేశారు. మెమొరీస్ వీడియో సాంగ్‌ను తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు.
మెమొరీస్ మ్యూజిక్ వీడియోకు అన్వేష్ భాష్యం దర్శకత్వం వహించాడు. అన్వేష్ బాష్యం సైమా నామినేటెడ్ షార్ట్ ఫిలిం చోటుకు కాన్సెప్ట్ రైటర్‌గా పనిచేశారు. మనోహరం టైటిల్‌తో వచ్చిన మ్యూజిక్ షార్ట్ ఫిలింకు రైటర్‌గా, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించాడు. వరుణ్ అనే యువకుడు తన జర్నీలో ఫీలింగ్స్ కోల్పోయే స్థితి నుంచి తన గమ్యం ఏంటి..? అని తెలుసుకునే నేపథ్యంలో మ్యూజిక్ వీడియో ఉండబోతుందట. ఈ పాటని అరుణ్ కంపోజ్ చేయగా.. తెలుగులో రాహుల్ సిప్లిగంజ్ పాడగా.. కన్నడలో వాసుకి వైభవ్ పాడారు. మలయాళంలో అర్జున్ విజయ్, తమిళంలో సుదర్శన్ ఎస్, హిందీలో రితేశ్ రావు జి ఈ సాంగ్ పాడారు.
MEMORIES – Pre-look of #SudhakarKomakula’s next independent Music Video shot in San Francisco, USA. Conceptualised & directed by #AnveshBashyam. A unique blend of 2D animation and real worlD 🌎 in 5 languages. @UrsSudhakarK @edmarun @BlogAnveshABD @Sukha_Media @redcedarsocial 🕺 pic.twitter.com/3dAm6LvnkP
— Sudhakar Komakula (@UrsSudhakarK) July 15, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

