Sudev Nair | టాలీవుడ్లో తమ విలక్షణ నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్న మాలీవుడ్ యాక్టర్లు చాలా మందే ఉన్నారు. ఇటీవల కాలంలో తెలుగులో అలా తన యాక్టింగ్‌తో దర్శకనిర్మాతల దృష్టిని ఆకర్షిస్తున్న యాక్టర్ ఎవరైనా ఉన్నారా..? అంటే సుదేవ్ నాయర్ పేరు చెప్పొచ్చు. ముంబై మోడల్ కమ్ యాక్టర్ అయిన సుదేవ్ నాయర్ మలయాళ సినిమాలతో పాపులర్ అయి ఆ తర్వాత తెలుగులో కూడా పర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ పాత్రలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.
రవితేజ నటించిన టైగర్ నాగేశ్వర్ రావు టాలీవుడ్ జర్నీ మొదలు పెట్టిన ఈ టాలెంటెడ్ యాక్టర్ జూనియర్ ఎన్టీఆర్ దేవర పార్ట్ 1లో మెరిశాడు. గతేడాది పవన్ కల్యాణ్ టైటిల్ రోల్ పోషించిన ఓజీలో కూడా నటించి మెప్పించాడు. ఇక ఈ ఏడాది చిరంజీవి నటించిన మన శంకర వరప్రసాద్ గారు చిత్రంలో వీరేంద్ర పాండేగా సుదేవ్ నాయర్ డిఫరెంట్ షేడ్స్‌లో నటించి మూవీ లవర్స్ నుంచి ప్రశంసలు అందుకుంటున్నాడు.
ఇక ప్రస్తుతం కేజీఎఫ్ ఫేం యశ్ నటిస్తోన్న టాక్సిక్‌లో పవర్ ఫుల్ రోల్లో నటిస్తున్నాడు సుదేవ్ నాయర్. జిమ్నాస్టిక్స్, మార్షల్ ఆర్ట్స్‌లో ప్రావీణ్యం ఉన్న సుదేవ్ నాయర్ రాబోయే రోజుల్లో టాలీవుడ్లో పవర్ ఫుల్ విలన్‌గా పేరు తెచ్చుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని తెగ చర్చించుకుంటున్నారు సినీ జనాలు.