Sudheer Babu | | హిట్లు ఫ్లాప్‌లతో సంబంధంలేకుండా కొత్తదనంతో కూడిన కథాంశాలను ఎంచుకుంటూ హీరోగా వైవిధ్యతను చాటుకుంటున్నాడు సుధీర్‌బాబు. గతంలో రొటీన్ సినిమాలను చేసుకుంటూ వచ్చిన సుధీర్ బాబు ‘సమ్మోహనం’ సినిమాతో తన రూట్ మార్చుకున్నాడు. ఈ చిత్రంలో సుధీర్ నటన ప్రేక్షకులను ఫిదా చేసింది. ఈ చిత్రం తర్వాత సుధీర్ కథల ఎంపిక పూర్తిగా మారింది. ‘వి’, ‘శ్రీదేవి సోడా సెంటర్’ వంటి వినూత్న కథలను ఎంచుకుంటున్నాడు. కమర్షియల్‌గా ఈ రెండు చిత్రాలు అంతగా సక్సెస్ కాకపోయినా సుధీర్‌కు మంచి గుర్తింపును తీసుకువచ్చాయి. ప్రస్తుతం ఈయన ప్రముఖ కమెడీయన్ హర్షవర్ధన్ దర్శకత్వంలో ఓ సినిమాను చేస్తున్నాడు. గతేడాది డిసెంబర్లో షూటింగ్ ప్రారంభమైన ఈ చిత్రం నుంచి ఇప్పటివరకు ఎలాంటి అప్డేట్ రాలేదు.
అయితే సుధీర్‌బాబు పుట్టినరోజు సందర్భంగా చిత్రబృందం ఈ సినిమా టైటిల్‌ను రివీల్ చేస్తూ ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ చిత్రానికి ‘మామా మశ్చీంద్ర’ అనే టైటిల్‌ను ఖారారు చేశారు. మశ్చీంద్ర అంటే కోరిక, కలలు, ఆశయం వంటి పాజీటీవ్ అర్థాలు వస్తాయి. తాజాగా విడుదలైన పోస్టర్లో సుధీర్‌బాబు పబ్బ్లో మైఖ్ పట్టుకుని పాటను ఆపిస్తున్నట్లుగా ఉన్నాడు. ప్రముఖ నటుడు, రచయిత హర్షవర్ధన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వరా సినిమాస్ ఎల్ఎల్పి బ్యానర్‌పై నారాయణ్ దాస్ కె నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రం తెలుగుతో పాటు హిందీలో విడుదల కానుంది. దీనితో పాటుగా సుధీర్ బాబు ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, పుల్లెల గోపిచంద్ బయోగ్రఫీలో నటిస్తున్నాడు.