K3 Movie Release Date Announced | కన్నడ హీరో సుదీప్ తెలుగులో మార్కెట్‌ను పెంచుకునే పనిలో ఉన్నాడు. ‘రక్త చరిత్ర’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సుదీప్ ‘ఈగ’, ‘బాహుబలి’, ‘సైరా’ వంటి సినిమాలతో టాలీవుడ్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఇటీవలే విడుదలైన ‘విక్రాంత్ రోన’తో ఈయనకు జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. ఈ చిత్రం కన్నడతో పాటు విడుదలైన ప్రతి భాషలో ఘన విజయం సాధించింది. ఇదిలా ఉంటే గతేడాది కన్నడలో విడుదలై బ్లాక్ బాస్టర్‌గా నిలిచిన ‘కోటీగబ్బా-3’ ఇప్పుడు తెలుగు విడుదలకు సిద్ధమైంది.
తెలుగులో ఈ చిత్రాన్ని ‘K3 కోటికొక్కడు’ టైటిల్‌తో మేకర్స్ విడుదల చేస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం సెప్టెంబర్ 16న విడుదల కానుంది. నిజానికి ఈ చిత్రం జూలైలోనే విడుదల కావాల్సి ఉంది. అయితే మేకర్స్ విక్రాంత్ రోన ఫలితం తర్వాత ఈ చిత్రాన్ని విడుదల చేయాలని భావించారు. ఇక విక్రాంత్ రోన తెలుగులో భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. కోటి ఇరవైదు లక్షల థియేట్రికల్ బిజినెస్ జరుపున్న విక్రాంత్రోన ఫైనల్‌గా సుమారు 4కోట్ల వరకు షేర్‌ను సాధించి బ్లాక్ బాస్టర్‌గా నిలిచింది. ఈ క్రమంలో K3 మేకర్స్ ఇదే కరెక్టు టైం అని భావించి సినిమాను విడుదల చేస్తున్నారు.
తెలుగులో ఈ చిత్రాన్ని గుడ్ సినిమా గ్రూప్ సమర్పిస్తుంది. శివ కార్తిక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సుదీప్‌కు జోడీగా మడోన్నా సెబాస్టియస్ హీరోయిన్గా నటించింది. రాంబాబు ప్రొడక్షన్ బ్యానర్‌పై సూరప్ప బాబు ఈ చిత్రాన్ని నిర్మించాడు.
You have loved him as #VikrantRona ♥️
Get ready to be entertained now with @KicchaSudeep's #K3Kotikokkadu
Grand Theatrical Release on 16th Sept 💥🤘@MadonnaSebast14 @shraddhadas43 #ShivaKarthik @thegcgofficial @shreyasgroup @shreyasmedia @anandaudioTolly @K3Kotikokkadu pic.twitter.com/iDFyyuygxa
— 𝐕𝐚𝐦𝐬𝐢𝐒𝐡𝐞𝐤𝐚𝐫 (@UrsVamsiShekar) August 29, 2022